తెలంగాణలో లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జూన్ 25లోగా అన్నదాతల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ప్రకటించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే ఈసందర్భంగా తుమ్మల మరో కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం పండ్ల తోటలు పెంచే వారికి కూడా రైతు భరోసా ఇచ్చే ఆలోచన చేస్తుందని తెలిపారు.ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో
నకిలీ విత్తనాలు
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ వానాకాలం మొదలైంది. ఈక్రమంలో అన్నదాతలకు ఎరువుల (Fertilizer) కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి జేపీ నడ్డాతో చర్చించారని తెలిపారు. అలానే నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు.
రుణమాఫీ
గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు మాత్రమే అమలు చేసి మిగతా అన్ని పథకాలు ఆపేశారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్ని పథకాలను అమలు చేస్తుందని,పాత రుణమాఫీని సైతం అమలు చేశామని తెలిపారు. అలానే కాళేశ్వరం కమిషన్ విచారణపై కూడా తుమ్మల స్పందించారు. కమిషన్ ముందు ఈటల రాజేందర్ తన ప్రస్తావన తీసుకురావడం వల్లే తాను రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చిందని మంత్రి తుమ్మల వెల్లడించారు.

అసంతృప్తి
రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా రైతు భరోసా నిధుల విడుదల కోసం అన్నదాతలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ఆలస్యం కావడంతో అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను సమీక్షించి,అప్పుల భారం నుంచి బయటపడిన తర్వాత రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.
ఆర్థిక సాయం
ప్రస్తుతం అధికారులు నిధుల పంపిణీని వేగవంతం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే జూన్ 25 నాటికి రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. సాగు ప్రారంభానికి ముందే రైతు భరోసా నిధు (Ritu bhandu funds)లు జమ చేయడం వల్ల వారికి పెట్టుబడి సాయం అందించినట్లు అవుతుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తోంది.
Read Also: Telangana: రంగారెడ్డి జిల్లాలో బోల్తా పడ్డ మామిడిపండ్ల లారీ