కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో సుమారు 2 కోట్ల 20 లక్షల ఎకరాల మాగాణి సాగు జరిగిందని కేంద్ర ప్రభుత్వ(TG Politics) గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర ఆర్థిక సర్వేలో బీఆర్ఎస్ పాలనపై సానుకూల వ్యాఖ్యలు నమోదయ్యాయని పేర్కొన్నారు.
Read Also:Phone Tapping Case : కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు – BRS లాయర్

సాగునీటి ప్రాజెక్టులతో ఆయకట్టు విస్తరణ
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో సుమారు 32 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగిందని హరీశ్ రావు తెలిపారు. ఈ చర్యల ఫలితంగానే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. సాగు అంశంపై(TG Politics) విమర్శలు చేస్తున్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి మాట్లాడితే మంచిదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆధారాలు ఉన్నప్పటికీ నిరాధార ఆరోపణలు చేయడం తగదని ఆయన సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: