(TG Municipal elections) మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్షించారు. గత పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమర్థ నిర్వహణకు తగు సూచనలు చేశారు.
Read Also: Medak District: పాఠశాలల ముందు సంక్రాంతి ముగ్గుల పోటీలు….

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు ఏ సమయంలోనైనా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని సంసిద్ధంగా ఉండాలన్నారు. నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి విధులు కేటాయించిన నోడల్ అధికారులుబాధ్యతగా వారి విధులు నిర్వహించాలని సూచించారు.మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్స్ రోల్ కీలకమన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్స్ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: