हिन्दी | Epaper

Telangana: నాలుగు రోజులు ఇదే వాతావరణం..ఆ తర్వాత వర్ష సూచనలు

Anusha
Telangana: నాలుగు రోజులు ఇదే వాతావరణం..ఆ తర్వాత వర్ష సూచనలు

తెలంగాణలో ఈశాన్య రాష్ట్రాల వైపు తేమ వెళ్లిపోవడం వల్ల తెలంగాణలో వర్షాలు తగ్గముఖం పట్టాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో మరో నాలుగు నుండి ఐదు రోజుల పాటు తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం, కొంత ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి.

అవకాశం ఉందని

వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు(Dharmaraju) వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి ఏర్పడింది. దాని ప్రభావంతో రేపటి నుంచే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ప్రధానంగా మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు కూడా నమోదు కావచ్చని చెప్పారు.ఈ వర్షాల ప్రభావం ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల్ వంటి జిల్లాల్లో కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, హైదరాబాద్ నగరంలో మాత్రం వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు.

Telangana: నాలుగు  రోజులు ఇదే వాతావరణం..ఆ తర్వాత వర్ష సూచనలు
Telangana

సర్దుబాటు చేసుకోవాలని

నాలుగైదు రోజుల తర్వాత పరిస్థితుల్లో మార్పు రావచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ధర్మరాజు తెలిపారు. రైతులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సాగు పనులు సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.అంతేకాక, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొత్తానికి తాత్కాలికంగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, కొన్ని రోజుల తర్వాత వర్షాలు తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.ఈ వాతావరణ మార్పులతో రైతులు,ప్రజలు ప్రభావితమవుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read Also: AP DSC ,TG TET: ఒకే తేదీల్లో ఏపీ డీఎస్సీ, తెలంగాణ టెట్ అయోమయంలో అభ్యర్థులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870