हिन्दी | Epaper

Telangana: తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుదారులకు శుభవార్త

Sharanya
Telangana: తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుదారులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో భాగంగా తాజా చర్యగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించడం గమనార్హం. ఈ చర్య ద్వారా రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.

కొత్త రేషన్ కార్డుల జారీ

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, రాష్ట్రంలోని పేద బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ నుండి అర్హులైన లబ్దిదారులకు మెసేజ్‌ల ద్వారా సమాచారం పంపించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో, వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.

గ్రామ సభల ద్వారా ఎంపిక

కొత్తగా మంజూరైనవారికి మే 25 నుంచి మొబైల్ లకు మెసేజ్ లు వస్తాయని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల సన్నబియ్యం పంపిణీ ఉంటుందని స్పష్టం చేసింది. గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేసినట్లు వివరించింది. కొత్త రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో 3 కోట్ల మంది రేషన్ లబ్దిదారులుగా ఉన్నారు. వీరికి నెలకు 1.89 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది.

ఉచిత సన్న బియ్యం పథకం – రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఉచిత సన్నబియ్యం పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని పేద కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఆరుగురు వ్యక్తులకు 6 కిలోల చొప్పున నెలకు 36 కిలోల సన్న బియ్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర సూచన – మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ

అన్ని రాష్ట్రాల్లో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ఆహార ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. వర్షాకాలంలో రేషన్ రవాణా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితుల్లో, అన్ని రాష్ట్రాల్లో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని, వర్షాకాలం ముందే ఈ చర్య తీసుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలు, తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. మే నెలలో ఇవ్వాల్సిన రేషన్ కోటాను ఇప్పటికే ఇచ్చేసింది. ఇక జూన్ లో మూడు నెలల కోటాను ఒకేసారి విడుదల చేస్తామని రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం.

Read also: Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870