తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన మీనాక్షి ఆయనతో కీలక విషయాలను చర్చించారు. పదిరోజుల పాటు నేతలతో మాట్లాడిన విషయాలను వివరించారు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల అక్కడ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఇక్కడ క్యాడర్‌లో కన్ఫ్యూజన్. కొత్త నేతలతో పాత నేతల లొల్లి, వీటికి పరిష్కారం వెతకండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan). ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరేలా కార్యాచరణ రూపొందించాలన్నారామె. గత పదిరోజులుగా తెలంగాణలో మకాం వేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవ హారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీ నేతలతో మీనాక్షి వరుస సమీక్షలు నిర్వహించారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలకు కొంతమంది అబ్జర్వర్స్‌ను నియమించి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మంతనాలు జరిపారు. వారి సమస్యలను, సూచనలను నోట్ చేసుకున్నారు.
పరస్పరం ఫిర్యాదులు
పదిరోజుల పాటు నేతలతో మాట్లాడిన విషయాలను వివరించారు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల పాత నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆధిపత్యపోరుతో పార్టీ క్యాడర్ ఇబ్బందులు పడుతున్నారని రేవంత్‌కు చెప్పారు మీనాక్షి. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్(Congress Social Media Team) బలహీనంగా ఉందన్నారు నటరాజన్. ప్రభుత్వ పథకాలను నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారన్నారామె.ఈ సమస్యలన్నింటికి పరిష్కార మార్గాలు చూపాలని రేవంత్‌కు తెలిపారు మీనాక్షి.

విధానపరమైన నిర్ణయాల
ఇంకోవైపు,తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు(Cabinet meetings) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయమన్నారు సీఎం రేవంత్.
Read Also: Phone Tapping Case : రేపు ఇండియాకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు