Indiramma Housing Funds: తెలంగాణలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇళ్లు మంజూరై, నిర్మాణ దశలో ఉన్న లబ్ధిదారులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది పేద కుటుంబాలకు తమ ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేసే అవకాశం కలిగింది.
Read Also: Siddipet Retired Employees Protest: సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

99 రోజుల ప్రణాళికతో వేగంగా బిల్లుల చెల్లింపు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల కార్యక్రమం’ (ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక) ప్రారంభించిన వారం రోజుల్లోనే ఈ నిధులను విడుదల చేయడం గమనార్హం. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా మొత్తం 2,764 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 28.50 కోట్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించింది. సకాలంలో బిల్లులు చెల్లించడం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) వీపీ గౌతమ్ అధికారికంగా వెల్లడించారు.
ప్రజా ప్రాలన ప్రగతి ప్రణాళికలో మొదటి వారం రోజుల పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఎండీ వీపీ గౌతం వెల్లడించారు.ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రత్యేక దృష్టి సారించామని.. నిశితంగా పరిశీలించి బిల్లులు క్లియర్ చేశామని ఎండీ వీపీ గౌంతం వివరించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గతవారం రోజుల్లో క్లియర్ చేసిన బిల్లులలో ఎల్-3 జాబితాలో ఉన్న 1200 మందికి సంబంధించి మెుత్తం రూ.12.06 కోట్ల విడుదల చేశామన్నారు. బిల్లులు విడుదలైనప్పటికీ వివిధ కారణాలతో బ్యాంక్ వద్ద పేమెంట్ ఫెయిల్ అయిన 653 మంది లబ్ధిదారులకు చెందిన రూ.7 కోట్ల మేర మొత్తాన్ని సైతం విడుదల చేసినట్లు ఆయన వివరించారు. వీటితో పాటు పలు అభ్యంతరాలు, నిశిత పరిశీలన నిమిత్తం పెండింగ్‌లో ఉన్న మరో 911 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.9.40 కోట్లను కూడా విడుదల చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: