ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది.ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.బెంగళూరు నిర్దేశించిన 191 పరుగుల ఛేదనలో పంజాబ్(Punjab) 184/7 వద్దే ఆగిపోవడంతో మొదటి టైటిల్ నెగ్గాలన్న ఆ జట్టు ఆశలు అడియాసలయ్యాయి. ఛేదనలో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (23 బంతుల్లో 39, 1 ఫోర్, 4 సిక్సర్లు) పోరాడినా ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ(RCB) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (35 బంతుల్లో 43, 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా కెప్టెన్ రజత్ పటీదార్ (16 బంతుల్లో 26, 1 ఫోర్, 2 సిక్స్‌ర్లు), జితేశ్ శర్మ (10 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లివింగ్‌స్టొన్ (15 బంతుల్లో 25, 2 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించారు.
అభినందనలు తెలిపారు
ఎన్నో ఏళ్లుగా వేచిన విరాట్ కోహ్లీ కల నెరవేరింది. అమోఘమైన విక్టరీ కొట్టిన ఆర్సీబీకి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆ విక్టరీపై స్పందించారు. ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో రియాక్ట్ అయ్యారు. కింగ్ కోహ్లీ భావోద్వేగ కన్నీళ్లు ఆ మధుర విజయాన్ని చెప్పేస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ కొట్టిన ఆర్సీబీకి, కోహ్లీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సడలని పట్టుదల, సంకల్పం, నిబద్ధతకు చీర్స్ కొట్టారు. చిట్ట చివరకు అద్భుత విజయాన్ని నమోదు చేసి ట్రోఫీని చేజిక్కించుకున్నారని ఆర్సీబీని కేటీఆర్ మెచ్చుకున్నారు.
ఐపీఎల్ చాంపియన్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) కూడా ఆర్సీబీ జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆర్సీబీకి ఆయన కంగ్రాట్స్ చెప్పారు. 18 ఏళ్ల ఓపిక, సహనం ఫలించిందని, హార్డ్‌వర్క్ కలిసివచ్చిందన్నారు. మీ టీమ్ వర్క్ మీ కలను నిజం చేసిందన్నారు. ఎట్టకేలకే ఐపీఎల్ చాంపియన్స్ అయ్యారని ఎమ్మెల్యే హరీశ్ తన ఎక్స్(X) అకౌంట్‌లో వెల్లడించారు.
Read Also: Virat Kohli: ఈ గెలుపు కోసం నా జీవితాన్ని దారపోసాను:కోహ్లీ