हिन्दी | Epaper

Rain: జూలై 1 నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Anusha
Rain: జూలై 1 నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల విస్తరణతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షపాతం కొనసాగుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం, ఈ వర్షాలు జూలై 1వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. అల్పపీడనం క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం పూర్తిగా తగ్గలేదని వాతావరణ నిపుణులు (Meteorologists) వెల్లడించారు.తెలంగాణలో,వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జూన్ 29న (నేడు) పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురవవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.

మరింత విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు

జూన్ 30వ తేదీన కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ (Warangal), హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురవొచ్చు.జూలై 1వ తేదీన, మరింత విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

 Rain: జూలై 1 నుంచి  తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
Rain

జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశముంది

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ (Hyderabad) , మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశముంది.

Read Also: Swetcha: యాంకర్ స్వేచ్ఛతో సంబంధంపై లేఖ విడుదల చేసిన పూర్ణ చందర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870