కౌమార దశలో ఉన్న బాలికల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కీలకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి ‘ఇందిరమ్మ అమృతం’ అనే పేరును పెట్టింది.నేడు(గురువారం) ఈ పథకం ప్రారంభించనుంది. టీనేజ్ బాలికల కోసం ఈ పథకం తీసుకువస్తోంది. రాష్ట్రంలో మహిళలు, బాలికల్లో చాల మంది రక్త హీనత(Anemia) సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారికి మెరుగైన పోషకాహారం అందించేందుకు తెలంగాణ మహిళా, శిశు సంక్షేమశాఖ చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా 14-18 ఏళ్ల బాలికలకు బలమైన పోషకాహారం అందించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది.పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ‘ఆడపిల్లలకు శక్తినిద్దాం,ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. దీని ద్వారా కౌమార బాలికలకు పల్లి, చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలను ఇవ్వనున్నారు. ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల(Anganwadi centers) ద్వారా వీటిని ఉచింతగా పంపిణీ చేయనున్నారు.

పథకాన్ని
ఒక్కో బాలికకు రోజుకు ఒకటి చొప్పున నెల మొత్తం సరిపోయేలా 30 చిక్కీలను అందిస్తారు. ఒక్కో దాంట్లో సుమారు 600 కేలరీలు, 18-20 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. రెండు సార్లు వీటిని పంపిణీ చేస్తారు. పదిహేను చిక్కీల చొప్పున, నెలకు రెండు సార్లు అంగన్వాడీ కేంద్రాల ద్వారా కౌమార బాలికలకు ‘ఇందిరమ్మ అమృతం'(Indiramma Amrutham) కిట్లను అందజేయన్నారు. అలానే బాలికల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు గాను త్వరలోనే ఆరోగ్యశాఖ హెచ్‌బీ పరీక్షలు నిర్వహించనుంది. ఈ సమస్య ఉన్న బాలికలను గుర్తించి వారికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందిస్తారు.తొలుత పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొమరం భీం అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం,జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఈప్రాజెక్ట్ అమలు కోసం ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, రాష్ట్రంలో 64.7 శాతం కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం దీనికి పరిష్కారంగా ఇందిరమ్మ అమృతం పథకాన్ని తీసుకురానుంది. దీనిలో భాగంగా అంగన్వాడీల ద్వారా 14-18 ఏళ్ల మధ్య వయస్సున్న కౌమార బాలికలకు పోషకాహారంగా పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
Read Also : Fly Over: హెచ్ సిటీలో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం