हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Job Mela : వరంగల్లో జాబ్ మేళా.. పోటెత్తిన నిరుద్యోగులు

Sudheer
Job Mela : వరంగల్లో జాబ్ మేళా.. పోటెత్తిన నిరుద్యోగులు

వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ జాబ్ మేళా జరిగింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో ఉత్సాహం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి తనకు తగిన ఉద్యోగం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు

వేల సంఖ్యలో అభ్యర్థులు ఒకేసారి హాజరుకావడంతో ప్రాంగణం బిజీ గా మారింది. బహుళ సంఖ్యలో వచ్చిన నిరుద్యోగులను నియంత్రించేందుకు పోలీసులు ముందుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. రద్దీ కారణంగా కొంత గందరగోళం నెలకొన్నా, అధికారులు చురుగ్గా వ్యవహరించి జాబ్ మేళా సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి అభ్యర్థికి సముచిత సమాచారం అందించేలా కౌంటర్లను ఏర్పాటు చేశారు.

jobmela
jobmela

100 కంపెనీలు – 8వేలకుపైగా ఉద్యోగాలు

ఈ జాబ్ మేళాలో రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పేరుపొందిన దాదాపు 100 కంపెనీలు పాల్గొన్నాయి. ఐటీ, మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, రీటైల్, బ్యాంకింగ్ వంటి విభాగాల్లో 8,000కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఇంటర్వ్యూలు ఎదుర్కొనడానికి అవకాశం లభించడంతో ఎంతో మంది తమ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ జాబ్ మేళా ఎంతో మందికి మంచి అవకాశాల వేదికగా నిలిచింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870