TG: తెలంగాణలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాల కల్పన కోసం కేటాయించిన భూములను అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
Read also: CP Sajjanar: మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదు

we will take back the lands
TG: కర్ణాటకలో ఇన్ఫోసిస్‌కు చెందిన భూమి విక్రయంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తెలంగాణలోనూ అదే న్యాయం అమలవ్వాలని కేటీఆర్ అన్నారు. రాయితీలపై ఇచ్చిన భూములను నిర్దిష్ట ప్రయోజనాలకు ఉపయోగించకుండా అమ్మడం సరికాదని పేర్కొన్నారు. అటువంటి భూములను ప్రభుత్వానికి తిరిగి అప్పగించి ప్రజల అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, ఆసుపత్రులు, పేదల గృహాలు, పార్కులు, బస్ స్టాండ్లు వంటి మౌలిక వసతుల కోసం ఈ భూములు అవసరమని తెలిపారు.
‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్తోందని కేటీఆర్ ఆరోపించారు. మార్కెట్‌లో గజం లక్ష రూపాయల విలువ ఉన్న భూమిని కేవలం రూ.4,000కే ప్రైవేటు వారికి కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ విధానాన్ని నమ్మి మోసపోవద్దని రియల్ ఎస్టేట్ డెవలపర్లకు హెచ్చరిక చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఆ భూములను ప్రభుత్వానికి వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: