తాజాగా నిర్వహించిన జీహెచ్ఎంసీ (GHMC) ప్యానెల్ మీటింగ్‌లు పలు కీలకాంశాలపై చర్చించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. వీటితో పాటు నగరంలోని చెరువులను కూడా పునరుద్ధరిస్తోంది. ఈ క్రమంలో భాగ్యనగరంలో హైడ్రా పునరుద్ధరించిన చెరువుల్లో బతుకమ్మ కుంట విశేష ప్రచారం పొందింది. ఒకప్పుడు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయిన ఈ చెరువును హైడ్రా బాగు చేసి కొత్త రూపునిచ్చింది. ఈ నేపథ్యంలో, బతుకమ్మ కుంటకు కాంగ్రెస్ నాయకుడి పేరు పెట్టడానికి జీహెచ్‌ఎంసీ ప్యానల్ ఆమోదం తెలిపింది.
Read Also: TG: 26 కులాలకు BC రిజర్వేషన్లు రద్దు

ఆగిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచనలు
అలాగే నగరంలోని ఆ ప్రాంతంలోనే మాజీ ప్రధాని, బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో గురువారం 11వ సాధారణ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 44 ఎజెండా అంశాలు, 8 టేబుల్ అంశాలు చర్చకు వచ్చాయి.
వీటిలో కీలకమైన అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సీఆర్ఎంపీ రెండో దశ పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రారంభోత్సవాల్లో తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని, ఆగిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: