హైదరాబాద్ : డ్రగ్స్ నివారించేందుకు వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఏజన్సీలు, యాంటీ నార్కోటిక్ టీమ్స్ నడుమ సమన్వయ సహకారాలు, నిఘాతో సాధ్యమవు తుందని రుజువు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ (DGP Jitender) అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ‘మాదకద్రవ్యాల అక్రమరవాణాను ఎదుర్కొవడం పై హైదరాబాద్ బంజారాహిల్స్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో డ్రగ్ లా ఎన్ఫోర్స్ మెంట్ ఏజన్సీ (Law Enforcement Agency) లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్, గోవా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహా రాష్ట్రాలతో సహ కేంద్ర, రాష్ట్రాధికారులు, ఏజన్సీ ప్రతినిధులు హజరయ్యారు. డ్రగ్స్ నివారణపై వ్యూహాలు, ప్రణాళికలపై డీజీపీ జితేందర్ వివరించారు. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతుండడంతో ప్రాంతీయ పరిస్థితులపై దృష్టిసారించాలన్నారు.

నేరస్తుల విచారణ
అదేవిధంగా రాష్ట్ర సరిహద్దులను నిఘాను మరింతంగా పెంచడంతో పాటు మన ఏజన్సీల సమన్వయాన్ని మెరుగుపర్చాలని పేర్కొన్నారు.నేరస్థులు, పరారీలో ఉన్న నిందితుల కూడా సంబందించిన సమాచారాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా నిఘా భాగస్వామ్యంతో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని వివరించారు. మాదకద్రవ్యాల చట్ట అమలు, స్పష్టమైన పురోగతి, అంతర్రాష్ట్ర నెట్వర్క్స్. నిర్వీర్యం చేయడంతో నేరస్తుల విచారణల దోహద పడుతాయని వెల్లడించారు. రాష్ట్రా మధ్య కార్యాచరణ ఐక్యత, పరస్పర సహకారా కొనసాగించాలి. డ్రగ్స్ నివారణ(Drug prevention)కు అధికారులు సైతం నిరంతం పాలుపంచుకోవాలని అన్నారు. నార్కోటిక్ బ్యూ డైరెక్టర్ సందీప్ శాండిల్య, డీఐజీ అభిషేక్ మహాంతితో పాటు ఆయా రాష్ట్రాల ఐపీఎస్ లు వర్షశర్మ, విమలాధిత్య, శారదరౌ నాగేష్ బాబు, మైలవగనం, తదితరులు పాల్గొన్నారు.
Read Also: Degree: డిగ్రీ రెండో విడత సీట్ల కేటాయింపు