తెలంగాణాలో బి ఆర్ ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రజతోత్సవ మహాసభను నిర్వహించనుంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల సరిహద్దు ప్రాంతం అయిన ఎల్కతుర్తి లో సభను నిర్వహించనుంది. ఈ సభకు కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లను చేస్తుంది.బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించడానికి 1213 ఎకరాల భూములను సేకరించింది. మొత్తం 159 ఎకరాలలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. 150 మంది కూర్చునే విధంగా భారీ బహుబలి వేదికను నిర్మిస్తున్నారు . దాదాపు ఏర్పాట్లు 80 శాతం పూర్తయ్యాయి. గత ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న అత్యంత భారీ సభ ఇది.
అట్టహాసంగా
ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ సభ ద్వారా గులాబీ బాస్ కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. ఈ సభకు మొత్తం 10 లక్షల మందిని జన సేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారు. 25 సంవత్సరాల బి ఆర్ ఎస్ పార్టీ చరిత్రను, పార్టీ వైభవాన్ని చాటి చెప్పే విధంగా అట్టహాసంగా ఏర్పాట్లను చేస్తున్నారు.సభ నిర్వహణకు భారీ బడ్జెట్ సభ ఏర్పాట్ల దగ్గర నుంచి జన సమీకరణ వరకు అనేక కమిటీలు ఏర్పాటు చేసుకొని నాయకులంతా సమన్వయంతో పని చేస్తున్నారు. మొత్తం ఈ సభ నిర్వహించడానికి భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు గా పార్టీ శ్రేణుల్లో టాక్ వినిపిస్తుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన జరగనున్న రజతోత్సవ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు.

నిర్వహణ కమిటీ
భారీ జన సమీకరణ చేయాలని ఇప్పటికే బి ఆర్ ఎస్ అధినేత కె చంద్రశేఖర రావు సూచనల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ జన సమీకరణకు పకడ్బందీగా పనిచేస్తున్నారు. అతిథులను ఆహ్వానించడానికి, ప్రోటోకాల్, నీటి సరఫరా, తదితరాలకు సంబంధించి మొత్తం 50 విభాగాలకు నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశారు.బీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఇంటికి ఒకరు చొప్పున తరలి వచ్చేలా కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారు. పార్టీకి సంబంధించి రోజుకొక ముఖ్య నేత భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్ వారిని సమన్వయం చేస్తూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Read Also: Andhra Pradesh: వారణాసి- అయోధ్య స్పెషల్ ఆంధ్రా లో హాల్ట్ స్టేషన్లు ఇవే!