हिन्दी | Epaper

Bandi Sanjay: మంత్రుల అవినీతి చిట్టా బయటపెడతా

Saritha
Bandi Sanjay: మంత్రుల అవినీతి చిట్టా బయటపెడతా

Bandi Sanjay: రాష్ట్రంలో కొందరు మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఐఏఎస్ అధికారులే మధ్యవర్తులుగా ఉంటూ ఆయా మంత్రులకు కమీషన్లు ముట్టజెబుతున్నారని మండిపడ్డారు. మంత్రుల అవినీతితోపాటు ఆయా ఐఏఎస్ ల భాగోతంపై ఆధా రాలను సేకరిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వారి బండారాన్ని బయటపెడతామని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, అఖిల పక్ష సమావేశం లేకుండా, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీహెచ్ఎంసీని (GHMC) గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లుగా ముక్కలు చేసిందన్నారు. అందులో హైదరాబాద్ జనాభా 7 లక్షలైతే అందులో 30 లక్షలకుపైగా జనాభా ముస్లింలే ఉన్నారని చెప్పారు.

Read Also: Hyderabad : కొత్త బాస్లు వీరేనా?

Bandi Sanjay: మంత్రుల అవినీతి చిట్టా బయటపెడతా
Bandi Sanjay: Ministers’ corruption will be exposed

కాంగ్రెస్ వైఫల్యాలు – బీజేపీ వ్యూహం

భాగ్యనగర్ అభివ్రుద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదని, కనీసం తట్టెడు మొరం కూడా పోయలేదని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లిస్ పార్టీల చెంపచెల్లుమనిపించారని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మూసీలో పడేయడం ఖాయమని అన్నారు. అఖిలపక్షం మీటింగ్ లేకుండా, ప్రజాప్రతినిధుల అభిప్రాయం లేకుండా ఏకపక్షంగా జీహెచ్ఎంసీని విభజించడం సిగ్గు చేటు. రేవంత్ రెడ్డి… జీహెచ్ఎంసీని మూడు ముక్కలు ఎందుకు చేశారో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. బీజేపీకి భయపడి హిందూ సమాజ ఓట్లను చీల్చడానికే జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారు. టీపీసీసీ కాదు…. టీ4సీ… తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్, కాంగ్రెస్. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే పరిమితమవుతున్నారే తప్ప తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలి?. రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ ఇవ్వకుండా వారి ఉసురు తీసుకుంటున్నరు. ఇదేమిటని ప్రశ్నిస్తున్న వ్రుద్దులను గుంజుకుపోయి జైల్లో వేయడానికి సిగ్గు లేదా?

భవిష్యత్ కార్యాచరణ, హెచ్చరిక

రాష్ట్రంలో కొందరు మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వారి అవినీతిపై ఆరా తీస్తున్నాం. ఆధారాలను సేకరిస్తున్నాం. ఆయా మంత్రుల అవినీతికి కొందరు ఐఏఎస్ అధికారులే మధ్యవర్తులుగా ఉన్నారు. అతి త్వరలో మంత్రుల కమీషన్ల చిట్టా, ఐఏఎస్ అధికారుల దందాలన్నీ బయటపెడతాం. ఐఏఎస్ అధికారులారా 2047 వికసిత్ భారత్ లక్ష్యాలు నెరవేరేదాకా బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతోంది. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలన ఉండదు. మంత్రి పదవులను అడ్డుపెట్టుకుని బరితెగించి బీజేపీని అడ్డుకోవాలనుకుంటే… మీ సంగతి చూస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలను మంత్రులు ఇబ్బంది పెట్టారు. ఆయా మంత్రుల మెడలు వంచుతాం…6 గ్యారంటీలు అమలయ్యేలా చేస్తాం భాగ్యనగర్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట మున్సి పాలిటీ అభివ్రుద్ధి కావాలంటే… మోదీ ప్రభుత్వ నిధులే శరణ్యం. రాబోయే ఎన్నికల్లో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాషాయ జెండాను ఎగరేయబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

📢 For Advertisement Booking: 98481 12870