తెలంగాణ నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రస్తుతం పెను సమస్య ఎదురవుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షలు జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా DSC పరీక్షలను జూన్ 6 నుంచి 30 మధ్యలో నిర్వహిస్తోంది. ఈ రెండు కీలక పరీక్షల షెడ్యూల్ ఒకదానికొకటి సంబంధం లేకుండా నిర్ణయించడంతో, అభ్యర్థులు పెద్ద చిక్కుల్లో పడ్డారు.తెలంగాణలో టెట్ రాయాల్సిన అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. మరోవైపు, నాన్‌లోకల్ కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్ DSC లో కూడా పోటీలో నిలవాలనుకునే అభ్యర్థులు సుమారు 7,000 మంది తెలంగాణకు చెందినవారే. వీరికి హైదరాబాద్ నగరంలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించబడ్డాయి. కానీ రెండు పరీక్షలు ఒకేసారి నిర్వహించడంతో, ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.
అయోమయంలో ఉన్నారు
ఎనిమిది రోజుల పాటు 2 రాష్ట్రాల పరీక్షలు ఉండగా,ఈ నెల 20వ తేదీన, టెట్ పేపర్–1 పరీక్ష కూడా ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ DSC లో ఎస్‌జీటీ పోస్టులకి పరీక్ష ఉంది. ఈ రెండింటినీ రాయాలంటే ఒక అభ్యర్థి ఒకేసారి రెండు చోట్ల ఉండలేడు. అందువల్ల ఎంతో మంది ఏ పరీక్షకు ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక అయోమయంలో ఉన్నారు.అభ్యర్థులలో కొందరు “టెట్ ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ డీఎస్సీ(DSC) చాలా అరుదుగా వస్తుంది” అని ఆలోచించి టెట్ వదులుకోవాలని యోచిస్తున్నారు. మరికొందరుDSC వైపు దృష్టి మళ్లిస్తున్నారు. కానీ దీనివల్ల ఎలాగైనా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

సమస్యలు తగ్గుతాయని
ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరంగా చర్చించి పరీక్ష తేదీలను సమన్వయం చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరీక్ష తేదీలు ఒకదానికొకటి అంతరాయంగా ఉండకూడదని, ప్రత్యేకించి ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకోవద్దని అభ్యర్థులు విన్నవిస్తున్నారు.పరీక్షలు ఆన్‌లైన్ మోడ్‌లో ఉన్నప్పుడు సాంకేతికంగా రోజులు మార్చడం పెద్ద సమస్యకాదు. కనీసం కొంతమంది అభ్యర్థులకు ప్రత్యామ్నాయ తేదీ కల్పించడం వల్ల సమస్యలు తగ్గుతాయని విద్యా వేత్తలు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం వలన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు దెబ్బతింటున్న ఈ పరిస్థితిని ప్రభుత్వం గమనించి వెంటనే పరిష్కారం తీసుకురావాలని అభ్యర్థులు కోరుతున్నారు.లేకపోతె, వారి శ్రమ, కృషి వృథా అవుతుంది.
Read Also: Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణకు నేడు ఈటల రాజేందర్ హాజర్