స్నాప్‌చాట్ యూజర్ల కోసం వీడియో ఎడిటింగ్‌ను మరింత ఈజీగా మార్చే ఉద్దేశంతో ‘క్విక్ కట్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఫోటోలు, వీడియో క్లిప్‌లను ఎంచుకుంటే చాలు.. అవే ఆటోమేటిక్‌గా మ్యూజిక్‌కు సరిపోయేలా ఎడిట్ అయి ఒక వీడియోగా మారిపోతాయి. మెమరీస్ సెక్షన్ నుంచే కాకుండా ఫోన్ కెమెరా రోల్‌లో ఉన్న ఫైల్స్‌తో కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఎడిటింగ్ అనుభవం లేని వారు కూడా సులభంగా ఆకర్షణీయమైన వీడియోలు తయారు చేయగలగడం దీని ప్రధాన ప్రత్యేకత.
Read also: Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు
తమకు నచ్చిన మ్యూజిక్‌ను మార్చుకునే అవకాశం
క్విక్ కట్‌లో మ్యూజిక్ ఆటో సింక్ కావడంతో పాటు, కావాలంటే యూజర్లు తమకు నచ్చిన మ్యూజిక్‌ను మార్చుకునే అవకాశం ఉంది. వీడియోలకు మరింత స్టైల్ ఇవ్వడానికి లెన్స్‌లు, ఫిల్టర్లు కూడా జోడించవచ్చు. ఇంకా వివరంగా ఎడిట్ చేయాలనుకునే వారికి టైమ్‌లైన్ ఎడిటర్ వంటి అడ్వాన్స్‌డ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ డివైస్‌లలో మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా తీసుకురావాలని స్నాప్‌చాట్ ప్లాన్ చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: