Google Maps: జెమినీ ఏఐతో కలిసి గూగుల్ తన మ్యాప్ యాప్‌లో తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ ‘ఆస్క్ మాప్స్’. ఇది కేవలం ఒక సెర్చ్ బార్ లా కాకుండా, చాట్‌బాట్‌లా పనిచేస్తుంది. దీనితో మీరు నేరుగా మాట్లాడవచ్చు.మ్యాప్స్‌కు సంబంధించి మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు అది సమాధానం చెబుతోంది. ఇందుకోసం మీరు మ్యాప్స్‌లో ఉన్న ‘ఆస్క్ మాప్స్’ బటన్ మీ నొక్కి, మీకు కావలసిన సమాచారం గురించి అడగవచ్చు.
Read Also: Vijayawada MSME Expo: నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో
ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ప్రదేశాలు, 50 కోట్ల మంది కంట్రిబ్యూటర్ల సమాచారాన్ని ఉపయోగించి జెమినీ ఏఐ మీకు సరైన సమాధానాలను అందిస్తుంది. ఉదాహరణకు మీరు మూడు గంటల పాటు ప్రయాణించేలా ఉంటే మధ్యలో లంచ్ చేయడానికి లేదా కాఫీ తాగడానికి వీలుగా ఉన్న ఫ్యామిలీ హైకింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? అని అడిగితే అది మీకు బెస్ట్ స్టేస్‌లను సజెస్ట్ చేస్తుంది.

ఇమ్మర్సివ్ నావిగేషన్: ఆస్క్ మ్యాప్స్‌తో పాటు, గూగుల్ ఇమ్మర్సివ్ నావిగేషన్‌ను అనే ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది, గత పదేళ్లలో డ్రైవింగ్, రూట్ గైడెన్స్‌లో ఇదే అతిపెద్ద మార్పు అని గూగుల్ పేర్కొంది. ఈ ఫీచర్‌లో మీరు జెమిని మోడల్స్ సపోర్ట్‌తో స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఫోటోలను కలిపి, రోడ్లు, భవనాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, ల్యాండ్‌మార్క్‌లను రియలిస్టిక్‌గా 3D రూపంలో చూపవచ్చు. ఈ ఫీచర్ వల్ల క్లిష్టమైన టర్నింగ్ వద్ద డ్రైవర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఏ లేన్‌లో వెళ్లాలో స్పష్టంగా అర్థమవుతుంది.
ఇమ్మర్సివ్ నావిగేషన్ ఫీచర్ అనేది ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం వాకింగ్, సైక్లింగ్ మార్గాల కోసం యాజ్ అవుతుంది. దీన్ని త్వరలో ఆండ్రాయిడ్ ఆటో, కార్‌ప్లే వంటి వాహన ప్లాట్‌ఫామ్‌లలోకి తీసుకురానున్నట్టు గూగుల్ పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: