हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Tamilasai: తమిళిసై తండ్రి కన్నుమూత

Anusha
Tamilasai: తమిళిసై తండ్రి కన్నుమూత

తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ కుమారి అనంతన్ (93). అనారోగ్యం, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కుమారి అనంతన్ బుధవారం (ఏప్రిల్ 9, 2025) తెల్లవారుజామున చెన్నైలో కన్నుమూశారు. ఆయన 1977లో నాగర్‌కోయిల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతన్ ఐదుసార్లు తమిళనాడు అసెంబ్లీ సభ్యుడిగా పనిచేశారు. అనంతన్ తమిళ రచయితగా, ప్రముఖ వక్తగా, రాజకీయ నేతగా ఎనలేని ముద్రవేసుకున్నారు.కుమారి అనంతన్ మృతిపట్ల తమిళిసై సౌందరరాజన్ తోపాటు పలువురు నేతలు నివాళులర్పించారు. సాలిగ్రామంలోని ఆయన కుమార్తె ఇంటి దగ్గర అంతిమ నివాళులర్పించడానికి అనంతన్ భౌతికకాయాన్ని అక్కడకి తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి.

కుమారి అనంతన్

1933 మార్చి 19న కన్యాకుమారి జిల్లా కుమారిమంగళంలో జన్మించిన అనంతన్‌కు తమిళం అంటే ఎనలేని ప్రేమ,ఆయనకు తమిళ సాహిత్యంలో మంచి పట్టు ఉంది. ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఆయన తమిళనాడులో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు అనంతన్, విల్లు పట్టు వాది అయిన తన తండ్రి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పటి నుండి సహజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. తన జన్మస్థలం పట్ల ప్రేమతో తన పేరుకు ‘కుమారి’ అని జోడించుకున్నారు అందుకే ఆయన్ను కుమారి అనంతన్ అని పిలుస్తారు.దివంగత కాంగ్రెస్ నాయకుడు, ముఖ్యమంత్రి కె. కామరాజ్ తో ఆయనకున్న అనుబంధంతో ఆయనకు యువజన కాంగ్రెస్ బాధ్యతలు దక్కాయి 1977లో నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పార్లమెంటులో తమిళంలో ప్రశ్నలు అడిగే హక్కును మొదట పట్టుబట్టి పొందినది అనంతన్ మాత్రమే ఆ తరువాత ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తొండర్ కాంగ్రెస్‌

తమిళనాడు రాష్ట్రానికి అనంతన్ చేసిన సేవలకుగాను 2024లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అత్యున్నత ‘తగైసల్ తమిజార్’ పురస్కారంతో సత్కరించింది. 2021లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘కామరాజర్’ అవార్డును ప్రదానం చేసింది. అనంతన్ మృతి పట్ల రాజకీయ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అనంతన్ 1980లో గాంధీ కామరాజ్ దేశీయ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీని స్థాపించారు కానీ అది విజయవంతం కాలేదు. తరువాత అతను మార్చి 2001లో తొండర్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు ఎన్నికల్లో ఓటమి తరువాత, అతను ఆ పార్టీను కాంగ్రెస్‌లో విలీనం చేశారు ఆయన వ్రాసిన పుస్తకాలలో నీంగళం పెచాలరాగళం (మీరు కూడా వక్త కావచ్చు), సెంబనై నాడు, పారాతీర పాడియ భారతి, నిలిత పుఘలుడైయోర్ ఎంతో పేరును తెచ్చిపెట్టాయి.

Read Also:Donald Tariff: మేక్ అమెరికా వెల్తీ అగైన్ కోసమే టారిఫ్ అంటున్న ట్రంప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870