MS Dhoni: ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించిన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ !

MS Dhoni: ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించిన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ !

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా మూడోసారి ఓటమిపాలైంది. 25 పరుగుల తేడాతో సీఎస్‌కేని ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ గురించే ఎక్కువగా చర్చ సాగుతున్నది. 43 ఏల్ల ధోని ఢిల్లీతో జరిగిన 11వ ఓవర్‌లో ఏడో నంబర్‌కు బ్యాటింగ్‌కు వచ్చాడు. చెన్నై 74 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి విజయానికి 56 బంతుల్లో 110 పరుగులు చేయాల్సింది. అయితే, మహి 26 బంతుల్లో కేవలం 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. దాంతో ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో. ఆ జట్టు హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మద్దతుగా నిలిచాడు.

Advertisements

ఐపీఎల్‌లో ధోనీ ఇప్పటికే బలంగానే ఆడుతున్నాడని చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌ గురించి ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో, జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఘాటుగా స్పందించారు. ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకే ప్రసక్తే లేదని, ఇప్పటికీ అతడు అద్భుతంగా ఆడుతున్నాడని స్పష్టం చేశారు.అతని భవిష్యత్‌పై మాట్లాడడం మానేశామని పేర్కొన్నారు.శనివారం మ్యాచ్‌లో ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు రాగా గతంలో బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. వరుసగా మూడో ఓటమి నుంచి గట్టెక్కించ లేకపోయాడు.ధోనీని ఫ్లెమింగ్‌ సమర్థిస్తూ ఆ సమయంలో బ్యాటింగ్ చేయడం నిజంగా కష్టమని తెలిపారు. ధోనీ అభిరుచిని ప్రదర్శించారు.అక్కడ ఆడటం కచ్చితంగా కష్టమేనని, ప్రయత్నించినప్పటికీ మ్యాచ్ మా చేతుల్లోంచి జారిపోయిందన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ బ్యాట్స్‌మెన్ లోకేష్ రాహుల్ చెన్నైకి చెందిన ఎడమచేతి వాటం మణికట్టు స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను లయలోకి రానివ్వలేదని దాంతోనే తమ జట్టు విజయంలో పెద్ద పాత్ర పోషించిందని ఢిల్లీ ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ తెలిపాడు.

 MS Dhoni: ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించిన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ !

25 పరుగుల తేడా

ఢిల్లీపై చెన్నై 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఢిల్లీకి వరుసగా మూడో విజయం. ఆరు పాయింట్లు, +1.257 నికర రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా చెన్నై జట్టు రెండు పాయింట్లతో టేబుల్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్నది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు, రన్‌రేట్‌ -0.891గా ఉన్నది. పంజాబ్‌పై విజయంతో రాజస్థాన్‌ సైతం పాయింట్ల పట్టికలో పైకి చేరింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన ఆ జట్టు రెండు విజయాలు, రెండు ఓటములతో ఏడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు, -0.185 రన్‌రేట్‌ ఉన్నది. ఇక పంజాబ్ జట్టు మూడు స్థానాలు కోల్పోయింది. ఢిల్లీ-చెన్నై మ్యాచ్ తర్వాత, పంజాబ్ కింగ్స్ మొదటి స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. పంజాబ్ మూడు మ్యాచులు ఉండగా.. రెండు విజయాలతో నాలుగు పాయింట్లు, +0.074 రన్‌రేట్‌గా ఉన్నది.

Related Posts
ఛార్‌ధామ్ యాత్రకు షెడ్యూల్ వెల్లడించిన ఉత్తరాఖండ్
Uttarakhand announced schedule for Chardham Yatra

మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం న్యూఢిల్లీ: ఈ ఏడాది ఛార్‌ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 30 నుంచి ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభమవుతుందని Read more

హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్
etela rajender slaps

బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తనపై మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Read more

మనీష్ సిసోడియా ఓటమి !
Manish Sisodia defeat!

న్యూఢిల్లీ : జంగ్పూరాలో మనీష్ సిసోడియాకు బిగ్ షాక్ తగిలింది. జంగ్పూరాలో మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ గెలిచారు. 600 Read more

CricketNews :పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్!
CricketNews :పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్!

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025లో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×