ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ లో ప్రత్యర్థులను వారి సొంత వేదికలపై చిత్తు చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ సొంత వేదికపై మాత్రం మరోసారి ఓటమివైపు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో మాదిరిగానే పంజాబ్‌తోనూ అదే రిపీట్ అయింది. శుక్రవారం వర్షం అంతరాయంతో 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై ఘన విజయం సాధించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 96 పరుగుల ఛేదనలో పంజాబ్ 12.1 ఓవర్లలో 98/5 స్కోరు చేసింది. నేహాల్ వధేరా(19 బంతుల్లో 33 నాటౌట్, 3ఫోర్లు, 3సిక్స్‌లు) జట్టు విజయంలో కీలకమయ్యాడు. హాజిల్‌వుడ్(3/14), భువనేశ్వర్(2/26) ఆకట్టుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ బ్యాటర్ల వైఫల్యంతో 14 ఓవర్లలో 95/9కే పరిమితమైంది. అనిశ్చితికి మారుపేరైన ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్ ఓపెనర్లు నిష్క్రమించగానే పెవిలియన్‌కు క్యూ కట్టింది. సాల్ట్ (4), కోహ్లీ (1), లివింగ్‌స్టొన్ (4), జితేశ్ (2), కృనాల్ (1) అలా వచ్చి ఇలా వెళ్లారు. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పటీదార్ (18 బంతుల్లో 23, 1 ఫోర్, 1 సిక్స్) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సన్ (2/10), చాహల్ (2/11), అర్ష్‌దీప్ సింగ్ (2/23), హర్‌ప్రీత్ (2/25) తలా రెండు వికెట్లు తీసి ఆర్‌సీబీని కట్టడిచేశారు.
ఓపెనర్ల
ఆర్‌సీబీ నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యఛేదనను పంజాబ్ నెమ్మదిగా మొదలుపెట్టింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్‌లో 3 పరుగులే రాగా రెండో ఓవర్ నుంచి పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్ బ్యాట్లు ఝులిపించారు. దయాల్ రెండో ఓవర్‌లో ప్రియాన్ష్ స్లిప్‌పై నుంచి కొట్టిన షాట్ బౌండరీకి దూసుకెళ్లింది. భువీ ఓవర్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రభ్‌సిమ్రన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టి డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 22 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌పడింది.ఆ తర్వాత 10 పరుగుల తేడాతో ప్రియాన్ష్ కూడా ఔట్ కావడంతో పంజాబ్ 32 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌లో శ్రేయాస్(7)తో పాటు, ఇంగ్లిస్(14) ఔట్ చేయడం,హాజిల్‌వుడ్ ఆర్‌సీబీకి అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు. అయితే క్రీజులో కుదరుకున్న నేహాల్ వధేరా బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీలతో చెలరేగాడు. శశాంక్ (1) నిరాశపరిచినా స్టొయినిస్(7 నాటౌట్)తో కలిసి నేహాల్ జట్టును గెలిపించాడు.

ఎత్తుగడలు
మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన అయ్యర్ ‘జీవితంలో విభిన్నమైన అనుభవాలతో పాటు అన్ని రకాల మ్యాచ్‌లు ఆడేందుకు మేం సిద్దంగా ఉన్నాం. ఇదో గొప్ప సవాల్. నిజం చెప్పాలంటే కెప్టెన్‌గా మైదానంలో నేను ఎక్కువగా ఆలోచించను. పరిస్థితులకు తగ్గట్లు ఎత్తుగడలు వేస్తూ ఉంటాను. కొత్త బ్యాటర్లు క్రీజులో సెట్ కాకూడదని భావించాను. మార్కో యాన్సెన్ ఎక్కువగా బౌన్స్ రాబట్టాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వాస్తవానికి ఈ వికెట్ ఇలా ఉంటుందని మాకు అస్సలు తెలియదు. కానీ కండిషన్స్‌ను మా బౌలర్లు అద్భుతంగా అందిపుచ్చుకున్నారు.నేను అర్ష్‌దీప్ సింగ్‌తో మాట్లాడినప్పుడు హార్డ్ లెంగ్త్ బాల్స్‌ను బ్యాటర్లు కొట్టలేరని చెప్పాడు. మధ్యలో మేం మాట్లాడుకున్నది ఇదే. ఈ ప్రణాళికను మా బౌలర్లు అద్భుతంగా అమలు చేశారు. నెహాల్ వధేరా అప్రోచ్ అసాధారణం. అతని అటిట్యూడ్ బాగుంది. అది ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా. చాహల్‌తో నేను ప్రత్యేకంగా మాట్లాడాను. ‘నువ్వో మ్యాచ్ విన్నర్. వీలైనంత వరకు వికెట్లు తీసే ప్రయత్నం చేయాలి. సేఫ్‌గా అస్సలు బౌలింగ్ చేయకు. వికెట్లు తీసేందుకే ప్రయత్నించు.’అని చెప్పాను. బౌన్స్ బ్యాక్ అయ్యే సామర్థ్యం చాహల్‌కు ఉంది. ఐపీఎల్‌లోనే అతను అత్యుత్తమ బౌలర్’అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
Read Also: IPL 2025: ఆర్‌సీబీపై పంజాబ్ ఘన విజయం