हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

Anusha
IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 300 సిక్స్‌ల మైలురాయి అందుకున్న కోహ్లీ ఒకే జట్టు తరఫున ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.సీఎస్‌కే బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్‌లో చివరి రెండు బంతులను కోహ్లీ భారీ సిక్సర్లుగా మలిచి ఈ ఫీట్ సాధించాడు.ఒకే జట్టు తరఫున అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో విరాట్ కోహ్లీ 301* సిక్స్‌లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత క్రిస్ గేల్ ఆర్‌సీబీ తరఫున 263 సిక్స్‌లు కొట్టగా ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 262, కీరన్ పోలార్డ్ 258 సిక్స్‌లు బాదారు. సీఎస్‌కే తరఫున ధోనీ 257 సిక్స్‌లు కొట్టాడు. ఐపీఎల్‌లో గత 18 సీజన్లుగా విరాట్ కోహ్లీ ఆర్‌సీబీకే ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62)హాఫ్ సెంచరీ నమోదు చేసి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

పరుగుల

వరుస పరాభవాలతో ఐపీఎల్‌-18లో అందరికంటే ముందు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే).. మరోసారి గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. చిన్నస్వామి వేదికగా చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో ఆతిథ్య రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) చెన్నైని 2 పరుగుల తేడాతో ఓడించి మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. బెంగళూరు నిర్దేశించిన 214 పరుగుల ఛేదనలో సీఎస్‌కే.. 20 ఓవర్లలో 211/5 వద్దే ఆగిపోయింది. ఆయుష్‌ మాత్రె (48 బంతుల్లో 94, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారానికి తోడు రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఆఖర్లో తడబడ్డ చెన్నైకి ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ విరాట్‌ కోహ్లీ (33 బంతుల్లో 62, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), జాకబ్‌ బెతెల్‌ (33 బంతుల్లో 55, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రొమారియా షెపర్డ్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌, 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 213/5 చేసింది.

 IPL 2025: ఐపిఎల్ లో  చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

హాఫ్ సెంచరీ

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 500 ప్లస్ సీజన్ రన్స్ చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 505 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌తో ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో కోహ్లీ 500 ప్లస్ రన్స్ చేయడం ఇది 8వ సారి. ఈ క్రమంలో అతను డేవిడ్ వార్నర్ రికార్డ్‌ను అధిగమించాడు. వార్నర్ 7 సార్లు 500 ప్లస్ రన్స్ చేశాడు.చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌గానూ కోహ్లీ నిలిచాడు. తాజా హాఫ్ సెంచరీతో అతను 10 సార్లు సీఎస్‌కేపై 50 ప్లస్ రన్స్ చేశాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ 9 సార్లు సీఎస్‌కేపై 50 ప్లస్ రన్స్ చేశారు. ఐపీఎల్‌లో ఓ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ కోహ్లీ నిలిచాడు. సీఎస్‌కేపై ఇప్పటి వరకు కోహ్లీ 1146 రన్స్ చేశాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్( పంజాబ్ కింగ్స్‌పై 1134), విరాట్ కోహ్లీ(ఢిల్లీపై 1130), విరాట్ కోహ్లీ(పంజాబ్ 1104), డేవిడ్ వార్నర్(కేకేఆర్‌పై 1093), రోహిత్ శర్మ(కేకేఆర్‌పై 1083) పరుగులు చేశాడు.

Read Also: IPL 2025 : ప్లేఆఫ్స్ ఛాన్స్: ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

📢 For Advertisement Booking: 98481 12870