ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ పేస్ బౌలర్, కీలక ఆటగాడు ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. ఇప్పటికే బలమైన జట్టుగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాకు, కమిన్స్ లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఈ పరిణామంతో టీమ్ కాంబినేషన్‌పై ప్రభావం పడే అవకాశముందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also: Novak Djokovic: విమర్శకులపై జకోవిచ్ సెటైర్లు
ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం
ప్రావిజనల్ జట్టులో రెండు మార్పులు చేసి, 15 మందితో కూడిన తుది జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు.ప్యాట్ కమిన్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ బెన్ ద్వార్షుయిస్‌ను జట్టులోకి తీసుకున్నారు.
బెన్ ద్వార్షుయిస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు. అలాగే ఓపెనర్ మాథ్యూ షార్ట్ స్థానంలో మాథ్యూ రెన్షాను జట్టులోకి చేర్చారు. రెన్షా ఇటీవలే పాకిస్థాన్‌పై టీ20 అరంగేట్రం చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కమిన్స్ లేకపోవడం కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు పెద్ద సవాలే. ఎందుకంటే కమిన్స్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును మానసికంగా బలోపేతం చేయగల అనుభవం ఆయనకు ఉంది.

ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ 2026 తుది జట్టు ఇదే
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కాన్లీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: