Sunrisers: ప్రముఖ క్రికెట్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ యాజమాన్యం వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇంగ్లాండ్‌లో జరిగే ‘ద హండ్రెడ్’ టోర్నీ కోసం పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (లీడ్స్) జట్టులోకి తీసుకోవడంపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ ఫ్యాన్స్ భావోద్వేగాలను పట్టించుకోకుండా పాక్ ఆటగాడిని ఎంపిక చేయడంపై నెటిజన్లు ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Read Also :RCB team : IPL 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది.

ఈ వివాదం ముదురుతున్న తరుణంలో సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ‘X’ (గతంలో ట్విట్టర్) అకౌంట్ సస్పెండ్ కావడం కలకలం రేపుతోంది. నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఈ ఖాతాను నిలిపివేసినట్లు ఆ పేజీలో కనిపిస్తోంది. అయితే, పాక్ ఆటగాడి ఎంపికతో ఆగ్రహం చెందిన యూజర్లు పెద్ద సంఖ్యలో సదరు అకౌంట్‌పై రిపోర్ట్ చేయడం వల్లే ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు, ఈ వ్యవహారం ఐపీఎల్ (IPL) జట్టుపై కూడా ప్రభావం చూపేలా కనిపిస్తోంది. కావ్యా మారన్ మరియు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలకు నిరసనగా, రాబోయే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్‌లను బహిష్కరించాలని (Boycott) సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. పాక్ ఆటగాళ్లతో సంబంధాలు ఉన్న జట్టుకు తాము మద్దతు ఇవ్వబోమని ఫ్యాన్స్ తెగేసి చెబుతుండటంతో ఫ్రాంచైజీ పరువు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :