ఐపీఎల్ 2025 సీజన్‌లో ముల్లాన్‌పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో పిచ్‌పై పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుని 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా కేకేఆర్ 95 పరుగులకు ఆలౌట్ అయ్యింది.ఇరు జట్ల స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకున్న పోరులో కింగ్స్ నిర్దేశించిన 112 పరుగుల స్వల్ప ఛేదనలో కేకేఆర్ 15.1 ఓవర్లలో 95 పరుగులకే చేతులెత్తేయడంతో పంజాబ్ 16 పరుగుల తేడాతో గెలిచింది.రఘువంశీ (28 బంతుల్లో 37, 5 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రీ రస్సెల్ (17) పోరాడారు. పంజాబ్ స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్ (4/28), యాన్సెన్ (3/17) కేకేఆర్‌ను దెబ్బతీశారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రన్ (15 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. హర్షిత్ రాణా (3/25) ఆరంభంలోనే కింగ్స్‌ను దెబ్బతీయగా మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్ (2/14), వరుణ్ చక్రవర్తి (2/21) కలిసి మిడిల్, లోయరార్డర్ పనిపట్టారు.
బ్యాట్ల మందం
ఈ నేపథ్యం లోనే గత మూడు నాలుగు మ్యాచుల నుంచి అంపైర్లు ప్లేయర్ల బ్యాట్లను చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ముందు కూడా ఈ టెస్టులు నిర్వహించారు. అయితే ఈ మ్యాచులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.అంపైర్లు సునీల్ నరైన్ , నోకియా బ్యాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ ఈ పరీక్షలో సునీల్ నరైన్, నోకియా బ్యాట్లు ఫెయిల్ అయ్యాయి. వారి బ్యాట్ల మందం ఎక్కువగా ఉన్నట్లు టెస్టుల్లో తేలింది. దీంతో అంపైర్లు ఆ బ్యాట్లను పక్కనపెట్టాలని సూచించారు. ఆ బ్యాట్లతో మ్యాచ్ ఆడటానికి పర్మిషన్ ఇవ్వలేదు.ముందుగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్, రఘువంశీ బ్యాట్లను రిజర్వ్ అంపైర్ సయ్యద్ ఖలీద్ చెక్ చేశాడు. ఆ సమయంలో మందం ఎక్కువగా ఉండటం వల్ల సునీల్ నరైన్ బ్యాట్ పరీక్షలో విఫలమైంది. కానీ రఘువంశీ బ్యాట్ మాత్రం టెస్టుల్లో పాసైంది. దీంతో అంపైర్ సునీల్ నరైన్‌ను మరో బ్యాట్‌తో ఆడమని సూచించాడు.

బ్యాట్ పరీక్ష
ముల్లాన్‌పూర్‌లో జరిగన మ్యాచ్‌లో మరో బ్యాటర్ అన్రిచ్ నోర్జా కూడా బ్యాట్ పరీక్షలో చిక్కాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడానికి వెళ్లిన సమయంలో బ్యాట్ చెక్ చేశాడు. బ్యాట్ సైజ్ పరిమితి దాటినట్లు గుర్తించారు. నరైన్ తరహాలోనే అతని బ్యాట్‌ను కూడా మార్పించారు. రిజర్వ్ అంపైర్ సయ్యిద్ ఖాలిద్ కేకేఆర్ బ్యాటర్ల బ్యాట్లను చెకింగ్ చేశాడు. బ్యాట్ పరీక్ష జరుగుతున్న సమయంలో కేకేఆర్ యువ బ్యాటర్ ఆంగ్రిశ్ రఘువంశీ అక్కడే ఉన్నాడు.అతని బ్యాట్‌కు చేసిన టెస్టులో అతను గట్టెక్కాడు.బీసీసీఐ నిబంధనల ప్రకారం బ్యాట్ ఫేస్ వద్ద వెడల్పు 10.79 సెంటీమీటర్లు, బ్యాట్ బ్లేడ్ వద్ద మందం 6.7 సెంటీమీటర్లు ఉండాలి. ఇక బ్యాట్ ఎడ్జ్ వద్ద వెడల్పు 4 సెంటీమీటర్లు, అలాగే బ్యాట్ పొడుగు 96.4 సెంటీమీటర్లు ఉండాలి.
Read Also:IPL : ఆరెంజ్ క్యాప్ విజేతల విశేషాలు – గేల్ నుంచి కోహ్లీ వరకూ