ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లోనూ ఆసీస్ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో, ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఎడమచేతివాటం బౌలర్‌గా స్టార్క్ రికార్డు సృష్టించాడు.
Read Also: Ankush Bharadwaj: షూటింగ్ కోచ్ పై లైంగిక వేధింపుల కేసు?
అసాధారణ ప్రదర్శన
ఈ క్రమంలో శ్రీలంక స్పిన్ దిగ్గజం రంగనా హెరాత్ పేరిట ఉన్న రికార్డును స్టార్క్ సమం చేశాడు. ప్రస్తుతం వీరిద్దరూ 433 టెస్ట్ వికెట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.సుదీర్ఘ ఫార్మాట్‌లో ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ సాధించిన అత్యధిక వికెట్లు ఇవే కావడం విశేషం. తాజాగా ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్‌లో మిచెల్ స్టార్క్ (Mitchell Starc)అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

బంతితో నిప్పులు చెరగడమే కాకుండా, బ్యాట్‌తోనూ కీలక పరుగులు సాధించాడు. సిరీస్ మొత్తం మీద 31 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో పాటు రెండు కీలకమైన హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: