న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టులో ఒక శకం ముగిసింది.జట్టు సారధిగా, స్టార్ బ్యాటర్‌గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోఫీ డెవిన్ వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పింది.ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న వన్డే ప్రపంచకప్ (One Day World Cup) తర్వాత ఆమె ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోనుంది.ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సీ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.

తన ఖాతాలో
ఇప్పటిదాకా 152 వన్డేలు ఆడిన 35 ఏండ్ల ఈ వెటరన్ ఆల్‌రౌండర్ (Veteran all-rounder) 3,990 పరుగులు చేసింది. ఇందులో 8 శతకాలు, 16 అర్ధ శతకాలున్నాయి. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన డెవిన్ (Sophie Devine) 107 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. కివీస్ తరఫున అత్యధిక పరుగులు (వన్డేల్లో) చేసిన బ్యాటర్లలో నాలుగో స్థానంలో ఉన్న డెవిన్ వికెట్ల విషయంలో రెండో స్థానంలో నిలిచింది.
Read Also: Glenn Maxwell: అదరగొట్టిన మ్యాక్స్‌వెల్..రోహిత్ శర్మ, వార్నర్ ల రికార్డు సమం