ఐపిఎల్ 2025 ప్రారంభంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రోహిత్ శర్మ తనకు ఎంతో ఇష్టమైన నీలం రంగు లాంబోర్గిని ఉరుసు కారును పోటీ విజేతకు బహుమతిగా ఇచ్చాడు. సుమారు రూ.4 కోట్ల విలువైన ఈ కారు ‘264’అనే నంబర్ ప్లేట్‌తో రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఎంతో ప్రత్యేకమైనది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన నీలం రంగు లాంబోర్గిని ఉరుస్‌ను విజేతకు అందజేస్తానని ఓ ప్రకటనలో ముందుగానే ప్రకటించారు. ఈ కారు రోహిత్‌కు ఎంతగానో సెంట్‌మెంట్‌గా ఉండటంతో ఆయన తన మాటను వెనక్కు తీసుకుంటారని చాలా మంది భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందుగా చేస్తూ రోహిత్ శర్మ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
మైలురాయి
విజేత కుటుంబంతో రోహిత్ శర్మ కలిసి ఫోటోలు దిగి కారు తాళాలను స్వయంగా అందజేశారు.ఈ లాంబోర్గిని కారు(Lamborghini car)రోహిత్ శర్మకు ఎంతో ప్రత్యేకమైనది. దానికి ముఖ్యకారణం ఆ కారు నంబర్ ప్లేట్. 2014లో శ్రీలంకపై సాధించిన రికార్డు స్కోరు 264కు గుర్తుగా రోహిత్ శర్మ కారు నంబర్ ‘264’ అద్భుతమైన కెరీర్ జ్ఞాపకానికి ప్రతీకగా నిలిచింది. 2014లో శ్రీలంకపై కోల్‌కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్‌లో రోహిత్ శర్మ 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మకు ఆ స్కోరు కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. అలాంటి కారును బహుమతిగా ఇవ్వడం అనేది కేవలం మాట నిలబెట్టుకోవడమే కాకుండా రోహిత్ శర్మకు అభిమానులు పట్ల ఉన్న నిబద్ధత, ఉదారతను చాటింది.
Read Also: IPL 2025: ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన హర్షల్ పటేల్