हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

PSL 2025: రెండో ఓటమిపై స్పందించిన రిజ్వాన్

Anusha
PSL 2025: రెండో ఓటమిపై స్పందించిన రిజ్వాన్

పీఎస్‌ఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 సీజన్ లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు అనూహ్యంగా వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే గత మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కొన్న రిజ్వాన్ సేన, బుధవారం జరిగిన మ్యాచ్‌లో కూడా ఓటమిని చవిచూసింది. ఈసారి షాదాబ్ ఖాన్ నేతృత్వంలోని ఇస్లామాబాద్ యునైటెడ్ చేతిలో 47 పరుగుల తేడాతో ముల్తాన్ జట్టు ఓడిపోవడం గమనార్హం.ఈ ఓటమి తర్వాత స్పందించిన కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌పై ప్రశ్నలు లేవనెత్తాడు. రెండో ఓటమి తర్వాత కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. “మేము ఊహించిన దానికంటే ఎక్కువ పరుగుల సాధించారు. బంతి కొంచెం ఆగి వచ్చింది. మేము 50-50 అవకాశాలను లక్ష్యం వైపు మార్చలేకపోయాము. వారు మంచి దూకుడుతో రాణించారు. మేము ఇంకా బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ కోసం చూస్తున్నాం. ప్రారంభంలో ఉన్న సమయంలో బ్యాట్, బంతి రెండింటిలోనూ అంతగా రాణించలేకపోయాం. మెరుగుపడతామని ఆశిస్తున్నాం. ఈ సీజన్ లో ముల్తాన్ సుల్తాన్స్ ఇంకా మంచి సమన్వయంతో కూడా ప్లేయింగ్ ఎలెవన్ ను కనుగొనలేదని దాని కారణంగానే ఆ జట్టు ఓడిపోతోంది.” అని మహ్మద్ రిజ్వాన్ అభిప్రాయపడ్డాడు.

 
PSL 2025: రెండో ఓటమిపై స్పందించిన రిజ్వాన్

లక్ష్యఛేదన

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన షాదాబ్ ఖాన్ సారథ్యంలోని ఇస్లామాబాద్ యునైటెడ్ 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ తరపున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సాహిబ్జాదా ఫర్హాన్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఈ మ్యాచ్‌లో 53 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇది కాకుండా కాలిన్ మున్రో 25 బంతుల్లో 48 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. జాసన్ హోల్డర్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనలో మహమ్మద్ రిజ్వాన్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముల్తాన్ సుల్తాన్స్ తరపున కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 38 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇది కాకుండా ఇఫ్టికార్ అహ్మద్ 32 పరుగులు, ఉస్మాన్ ఖాన్ 20 బంతుల్లో 31 పరుగులు సాధించారు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరపు బౌలింగ్ చేసిన జాసన్ హోల్డర్ గరిష్టంగా 4 వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన ప్రదర్శనకు జాసన్ హోల్డర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

Read Also: IPL 2025: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ పై వేటు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870