భారత్- పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.శనివారం నుంచి ఐపీఎల్ పున:ప్రారంభం కానుంది.ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలుస్తుందని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్(Mohammed Kaif) జోస్యం చెప్పాడు. ఈ సీజన్‌లో ఆ జట్టు అద్భుతంగా రాణిస్తుందని తెలిపాడు.శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ, కేకేఆర్ బెంగళూరు వేదికగా తలపడనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీకి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు కామెంట్ చేస్తున్నారు.

ప్రత్యర్థులను
తాజాగా ఆర్‌సీబీ ప్రదర్శన గురించి మాట్లాడిన మహమ్మద్ కైఫ్ ఆ జట్టుపై ప్రశంసల జల్లు కురపించాడు.’ఆర్‌సీబీ ఈసారి చాలా అద్భుతంగా ఆడుతోంది. సమష్టిగా రాణిస్తోంది. గతంలో ఆర్‌సీబీ బ్యాటింగ్ విభాగంపైనే ఎక్కువగా ఆధారపడేది. కానీ ఈసారి బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. రజత్ పటీదార్ తన బౌలర్లను అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రత్యర్థులను తక్కువ స్కోరుకే కట్టడి చేస్తున్నాడు.కోహ్లీ ఎప్పటిలాగే బ్యాట్‌తో నిలకడగా రాణిస్తున్నాడు. కానీ ఈ సారి బౌలర్లు కూడా తమ వంతు ప్రదర్శన చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. టైటిల్ గెలవగలమనే నమ్మకాన్ని ఇచ్చారు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సమతూకంగా ఉన్న జట్టుకే విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో ఆర్‌సీబీ(RCB) విజేతగా నిలుస్తుందని నేను బలంగా నమ్ముతునున్నాను.’అని కైఫ్ చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఆర్‌సీబీ ఒకటి. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ గెలవలేదు. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ చేరిన ఆ జట్టు తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ చేరిన మూడో జట్టుగాను ఆర్‌సీబీ చరిత్రకెక్కింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 9 సార్లు ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ 12 సార్లు ప్లే ఆఫ్స్ చేరి టాప్‌లో ఉండగా ముంబై 10 సార్లు ప్లే ఆఫ్స్ చేరి ఆర్‌సీబీ కంటే ముందుంది. ఈ రెండు జట్లు ఐదేసి టైటిళ్లు సొంతం చేసుకున్నాయి.
Read Also : Anil Kumble : కోహ్లీ స్థానంలో కరుణ్ నాయర్? కుంబ్లే కీలక సూచన!