हिन्दी | Epaper
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

Rajat: అండగా నిలచిన అభిమానులే మా విజయం:రజత్ పటీదార్

Anusha
Rajat: అండగా నిలచిన అభిమానులే మా విజయం:రజత్ పటీదార్

ఐపీఎల్ 2025 సీజన్‌ ఫైనల్లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది.ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో ఆరు ప‌రుగుల తేడాతో ఆర్సీబీ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది.బెంగళూరు నిర్దేశించిన 191 పరుగుల ఛేదనలో పంజాబ్‌(Punjab) 184/7 వద్దే ఆగిపోవడంతో మొదటి టైటిల్‌ నెగ్గాలన్న ఆ జట్టు ఆశలు అడియాసలయ్యాయి. ఛేదనలో శశాంక్‌ సింగ్‌ (30 బంతుల్లో 61 నాటౌట్‌, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), జోష్‌ ఇంగ్లిస్‌ (23 బంతుల్లో 39, 1 ఫోర్‌, 4 సిక్సర్లు) పోరాడినా ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ(RCB) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (35 బంతుల్లో 43, 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ (16 బంతుల్లో 26, 1 ఫోర్‌, 2 సిక్స్‌ర్లు), జితేశ్‌ శర్మ (10 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లివింగ్‌స్టొన్‌ (15 బంతుల్లో 25, 2 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించారు.

చాలా ప్రత్యేకమైనది

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రజత్ పటీదార్(Rajat Patidar) బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైందని తెలిపాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు రాణించడంతోనే టైటిల్ అందుకున్నామని చెప్పాడు.’నాతో పాటు విరాట్ కోహ్లీ, 18 ఏళ్లుగా జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానులందరికీ ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. ఈ విజయానికి అభిమానులు పూర్తి అర్హులు. క్వాలిఫయర్-1 గెలవగాలనే టైటిల్ సాధిస్తామనే నమ్మకం కలిగింది. ఈ వికెట్‌పై 190 పరుగుల మంచి స్కోర్ అని నేను ముందే అనుకున్నాను. ఎందుకంటే వికెట్‌ చాలా స్లోగా ఉంది. మా బౌలర్లు ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేసి ఫలితం రాబట్టారు. కృనాల్ మా వికెట్ టేకర్. నాకు ఒత్తిడి కలిగినప్పుడల్లా నేను కృనాల్‌(Krunal)కు బంతిని అందిస్తా.

ఈ విజయానికి కోహ్లీ పూర్తి అర్హుడు

సుయాష్ శర్మ కూడా ఈ సీజన్‌లో అదరగొట్టాడు. అతనితో పేసర్లు భువనేశ్వర్ కుమార్ యాదవ్, యష్ దయాల్, జోష్ హజెల్ వుడ్, రొమారియో రాణించారు. రొమారియో(Romario) బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ 2-3 ఓవర్లు వేసి బ్రేక్ త్రూ అందించాడు. విరాట్ కోహ్లీ పర్యవేక్షణలో ఆర్‌సీబీ(RCB)కి కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప అవకాశం. కెప్టెన్‌గా నేను ఎంతో నేర్చుకున్నాను. ఈ విజయానికి కోహ్లీ పూర్తి అర్హుడు. విరాట్ కోహ్లీ, అభిమానులతో పాటు నాకు అండగా నిలిచిన మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్‌కు ధన్యవాదాలు. అభిమానులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ‘ఈ సాలా కప్‌ నమ్దూ’.’అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.

Read Also: RCB: ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హ‌రీశ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870