Pakistan World Cup news : ఐసీసీ టీ20 ప్రపంచకప్–2026లో Pakistan national cricket team పాల్గొంటుందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని ఐస్‌లాండ్, ఉగాండా క్రికెట్ బోర్డులు సోషల్ మీడియాలో సరదా పోస్టులతో పాకిస్థాన్‌ను ట్రోల్ చేస్తున్నాయి. పాక్ తప్పుకుంటే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఈ రెండు దేశాలు ఫన్నీగా స్పందించడంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
భద్రతా కారణాలతో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. దీంతో (Pakistan World Cup news) బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోగా, వారి స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం లభించింది. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. పాక్ కూడా టోర్నీ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉందన్న వ్యాఖ్యలతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.
Read Also: Australia: ఆసీస్ కెప్టెన్‌గా సోఫీ మోలినెక్స్ నియామకం

ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు హాస్యభరితంగా స్పందించింది. “పాకిస్థాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి. వాళ్లు ఆడకపోతే మేము వెంటనే బయలుదేరడానికి సిద్ధం. కానీ మా ప్రయాణ షెడ్యూల్ కాస్త క్లిష్టంగా ఉంది” అంటూ సరదాగా ట్వీట్ చేసింది. అనంతరం తమ ఆటగాళ్లు బేకర్లు, షిప్ కెప్టెన్లు లాంటి ఉద్యోగాల్లో ఉన్నారని చెబుతూ తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జోక్ చేసింది.
దీనికి ఉగాండా క్రికెట్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. “టీ20 ప్రపంచకప్‌లో సీటు ఖాళీ అయితే ఉగాండా రెడీ. మా పాస్‌పోర్టులు సిద్ధంగా ఉన్నాయి. మా జట్టులో పార్ట్‌టైమ్ బేకర్లు లేరు” అంటూ వ్యంగ్యంగా స్పందించింది. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ఇప్పటికే జట్టును ప్రకటించినప్పటికీ, టోర్నీలో పాల్గొనడంపై తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. పీసీబీ చైర్మన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయిన నేపథ్యంలో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: