हिन्दी | Epaper

IPL 2025: ముంబై ఇండియన్స్‌కు అద్భుత అవకాశం

Anusha
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు అద్భుత అవకాశం

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా , టాప్-3లో నిలిచిన జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో తడబడుతున్నాయి. వరుసగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో టాప్-3 టీమ్స్ ఓడిపోయాయి. లక్నో చేతిలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్‌సీబీ ఓడగా తాజాగా పంజాబ్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. ఈ మూడు జట్లతో పాటు ముంబై ఇండియన్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. ఈ నాలుగు జట్లు టాప్-2 ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. ఆర్‌సీబీ, గుజరాత్, పంజాబ్ ఓటముల నేపథ్యంలో పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచేందుకు ముంబై ఇండియన్స్‌కు గోల్డెన్ ఛాన్స్ లభించింది.పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయం సాధిస్తే టాప్-2లో నిలవనుంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 18 పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ 17 పాయింట్స్‌తో రెండు, మూడు స్థానంలో కొనసాగుతున్నాయి. ముంబై ఇండియన్స్ 16 పాయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉంది.

IPL 2025: ముంబై ఇండియన్స్‌కు అద్భుత అవకాశం
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు అద్భుత అవకాశం

రన్‌రేట్‌

లక్నోతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధిస్తే 19 పాయింట్స్‌తో టాప్-2లో నిలుస్తుంది. ఓడితే మాత్రం టాప్-2 ప్లేస్ రేసు నుంచి తప్పుకుంటుంది.సీఎస్‌కేతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే 20 పాయింట్స్‌తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఓడినా మెరుగైన రన్‌రేట్‌తో ఉంటే టాప్-2లో చోటు దక్కుతుంది.ముంబై ఇండియన్స్‌పై విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్‌(Punjab Kings) టాప్-2 ప్లేస్ ఖరారవుతోంది.సీఎస్‌కే చేతిలో గుజరాత్ టైటాన్స్, లక్నో చేతిలో ఆర్‌సీబీ ఓడి పంజాబ్‌పై ముంబై విజయం సాధిస్తే టాప్ ప్లేస్ ఖరారవుతోంది.

Read Also : IND vs ENG: జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్ కాకపోవడానికి కారణం ఏంటంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఘనంగా రేపు కుల్దీప్ యాదవ్ పెళ్లి ఏర్పాట్లు

ఘనంగా రేపు కుల్దీప్ యాదవ్ పెళ్లి ఏర్పాట్లు

సోదరుడి పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సారా

సోదరుడి పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సారా

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

IPL 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది.

IPL 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది.

పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

ఫ్రాన్స్ ఎంబసీలో క్రికెటర్ అభిషేక్ శర్మ సందడి- టీమిండియాకు అభినందనలు

ఫ్రాన్స్ ఎంబసీలో క్రికెటర్ అభిషేక్ శర్మ సందడి- టీమిండియాకు అభినందనలు

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

క్రికెట్‌లో ఫిక్సింగ్.. పలువురిపై ఐసీసీ వేటు!

క్రికెట్‌లో ఫిక్సింగ్.. పలువురిపై ఐసీసీ వేటు!

ద్రవిడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

ద్రవిడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

📢 For Advertisement Booking: 98481 12870