हिन्दी | Epaper
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

LSG vs GT: గుజరాత్ టైటాన్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ ఏమన్నారంటే?

Anusha
LSG vs GT: గుజరాత్ టైటాన్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న గుజరాత్ టైటాన్స్‌కు ఈ ఓటమితో వచ్చే నష్టం పెద్దగా లేకున్నా టాప్-2లో నిలిచే అవకాశాలపై ప్రభావం చూపనుంది.ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శుభ్‌మన్ గిల్(Shubman Gill) 15-20 పరుగులు తక్కువగా ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ‘బౌలింగ్‌లో మేము 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. లక్నోను మేం 210-220 పరుగులకు కట్టిడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఈ అదనపు పరుగులే మా విజయవకాశాలను దెబ్బతీసాయి.ప్లేఆఫ్స్‌కు సన్నాహకంగా ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేయలేదు. నిజం చెప్పాలంటే పవర్ ప్లేలో మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ మాకు వికెట్లు దక్కలేదు.అయితే 14 ఓవర్లలో లక్నో 180 పరుగులు చేసింది. ఇది చాలా ఎక్కువ. ఛేజింగ్‌లో 17వ ఓవర్‌ వరకు మేం మ్యాచ్‌లోనే ఉన్నాం. షారుఖ్ ఖాన్, రూథర్‌ఫర్డ్(Rutherford) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తదుపరి మ్యాచ్‌ గెలిచి ప్లే ఆఫ్స్‌కు ముందు మూమెంట్ అందుకోవడం ముఖ్యం.’అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

సిక్స్‌

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117) సెంచరీతో చెలరేగగా నికోలస్ పూరన్(27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసారు.

 
 LSG vs GT: గుజరాత్ టైటాన్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ ఏమన్నారంటే?
LSG vs GT:

హాఫ్ సెంచరీ

అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓటమిపాలైంది. షారుఖ్ ఖాన్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. శుభ్‌మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 35), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 38) రాణించాడు. లక్నో బౌలర్లలో విల్ ఓ రూర్కీ(3/27) మూడు వికెట్లు తీయగా ఆవేశ్ ఖాన్(2/51), ఆయుష్ బదోని(2/4) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆకాశ్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న లక్నో.. ఓదార్పు విజయాన్నందుకుంది.

Read Also: IPL 2025 : లక్నో సంచలనం.. టైటాన్స్‌పై 33 పరుగుల తేడాతో గెలుపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870