న్యూజిలాండ్‌తో, ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. కేవలం 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్, ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా అర్థ శతకం బాదిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులతో అజేయంగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Read Also: IS Bindra: BCCI మాజీ అధ్యక్షుడు బింద్రా ఇకలేరు
భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు
ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) యువీ రికార్డ్‌ను బ్రేక్ చేయడం అంత ఈజీ కాదన్నాడు. ‘నా జట్టు నా నుంచి ఆశిస్తున్నది విధ్వంసకర బ్యాటింగే. ప్రతీసారి ఇలా ఆడటం అంత సులువు కాదు. యువరాజ్ సింగ్ 12 బంతుల్లో చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్‌ను బ్రేక్ చేయడం అసాధ్యం.

కానీ భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు.మైదానంలో తన వినూత్న ఫుట్‌వర్క్ వెనుక ఉన్న రహస్యాన్ని కూడా అభిషేక్ బయటపెట్టాడు. “ఫీల్డర్లు ఎక్కడ ఉన్నారో గమనించి, దానికి తగ్గట్టుగా రూమ్ క్రియేట్ చేసుకుని ఆడతాను. బౌలర్ నా వికెట్ తీయాలని ఏ బంతి వేస్తాడో ముందే ఊహించి స్పందిస్తాను” అని తన గేమ్ ప్లాన్‌ను వివరించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: