हिन्दी | Epaper

IPL 2026: ధోనీకి ఇదే చివరి సీజన్: ఇర్ఫాన్ పఠాన్

Aanusha
IPL 2026: ధోనీకి ఇదే చివరి సీజన్: ఇర్ఫాన్ పఠాన్

IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఇది మింగుడుపడని వార్తే కావచ్చు. ఐపీఎల్ దిగ్గజం, వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీకి రాబోయే సీజనే చివరిది కావొచ్చని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ప్రతి ఏడాది ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతున్నప్పటికీ, ఈసారి అది వాస్తవం అయ్యే అవకాశాలు ఉన్నాయని పఠాన్ విశ్లేషించాడు.

Read Also: Arjun Tendulkar Wedding Photos: సోదరుడి పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సారా

ధోనీ లేని సీఎస్కే అసంపూర్ణం: ఇర్ఫాన్ పఠాన్

జియో హాట్‌స్టార్‌తో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. “ధోనీ లేనిదే సీఎస్కే అసంపూర్ణం. ఈ సీజన్‌లోనే అతడిని చివరిసారిగా ఎల్లో జెర్సీలో చూస్తామేమో. డ్రెస్సింగ్ రూమ్‌లో అతని ఉనికి జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, భవిష్యత్తు కోసం మరో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ధోనీ పాత్ర చాలా కీలకం.

IPL 2026: Is this Dhoni's last season: Irfan Pathan
IPL 2026: Is this Dhoni’s last season: Irfan Pathan

అతను ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడో కచ్చితంగా చెప్పలేను, కానీ జట్టును ఐక్యంగా ఉంచడంలో సాయపడతాడు” అని వివరించాడు.ధోనీ ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ వంటి విషయాల్లో సీఎస్కే యాజమాన్యం జాగ్రత్తగా వ్యవహరిస్తుందని పఠాన్ పేర్కొన్నాడు. ఆరోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి తమ అభిమాన ‘తలా’కు ఘనమైన వీడ్కోలు పలకాలని జట్టు యాజమాన్యం గట్టిగా కోరుకుంటుందని జోస్యం చెప్పాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870