हिन्दी | Epaper

IPL 2026: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

Anusha
IPL 2026: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఫ్రాంచైజీలకు గట్టి షాక్ ఇచ్చింది. జట్ల ప్రాక్టీస్ సెషన్లలో సమాన అవకాశాలు కల్పించేందుకు కొన్ని కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం, ఒక జట్టు ప్రాక్టీస్ చేసిన పిచ్‌ను లేదా నెట్స్‌ను మరో జట్టు తన సెషన్ కోసం ఉపయోగించడానికి వీల్లేదు. ప్రతి జట్టుకు తాజాగా సిద్ధం చేసిన నెట్స్‌ను మాత్రమే కేటాయించాలని హోస్ట్ అసోసియేషన్లకు బీసీసీఐ స్పష్టం చేసింది. ఒక జట్టు ప్రాక్టీస్ ముగించిన తర్వాత, వారు వాడిన రేంజ్-హిట్టింగ్ వికెట్లు లేదా త్రో-డౌన్ నెట్స్‌ను రెండో జట్టు వాడకూడదని నిబంధన విధించింది.

Read Also: RCB team : IPL 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది

ప్రాక్టీస్ మ్యాచ్‌లపై పరిమితులు.. పిచ్ వినియోగంలో కఠినం

ప్రాక్టీస్ మ్యాచ్‌లపైనా బీసీసీఐ స్పష్టమైన సూచనలు చేసింది. ఫ్రాంచైజీలు గరిష్ఠంగా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుకోవచ్చు. అయితే, ఈ సమాచారాన్ని ముందుగానే బీసీసీఐకి తెలియజేయాలి. ఈ మ్యాచ్‌లను అసలు మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్‌పై నిర్వహించకూడదు. ఒకవేళ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలనుకుంటే, దాని వ్యవధి మూడున్నర గంటలకు మించరాదని కూడా బీసీసీఐ నిర్దేశించింది.

IPL 2026: BCCI's sensational decision.. New rules regarding practice for IPL teams
IPL 2026: BCCI’s sensational decision.. New rules regarding practice for IPL teams

సీజన్‌లో ఒక ఫ్రాంచైజీ తమ తొలి హోమ్ మ్యాచ్ ఆడేందుకు నాలుగు రోజుల ముందు నుంచి ప్రధాన స్క్వేర్‌పై ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లు లేదా మ్యాచ్‌లు నిర్వహించరాదు. ఈ సమయంలో హోమ్ ఫ్రాంచైజీ కోరితే, సంబంధిత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి రుసుము లేకుండా ప్రత్యామ్నాయ ప్రాక్టీస్ గ్రౌండ్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది.

ప్రాక్టీస్ కోసం రెండు జట్లకు చెరో రెండు నెట్స్, రేంజ్ హిట్టింగ్ కోసం ప్రధాన స్క్వేర్‌పై ఒక నెట్‌ను కేటాయిస్తారు. ప్రాక్టీస్ షెడ్యూల్ విషయంలో ఏవైనా వివాదాలు తలెత్తితే, విజిటింగ్ జట్టుకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. సాధారణంగా హోమ్ జట్టుకే తొలి ప్రాధాన్యం ఉన్నప్పటికీ, విజిటింగ్ జట్టు ప్రయాణ ఏర్పాట్లు, ముందు రోజు మ్యాచ్ ఆడి ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వారి అభ్యర్థనను గౌరవిస్తామని తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870