ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయాన్ని సాధించి క్వాలిఫయర్-1లో ఆడేందుకు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టుతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయీ 184 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలోనే ముంబైని ఓడించింది. ఈ క్రమంలో ముంబై ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక ప్రకటన చేశాడు.
ప్రత్యర్థులు
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మాట్లాడుతూ, “ఈ పిచ్‌ను బట్టి చూస్తే కనీసం 20 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. ఇది క్రికెట్‌లో జరుగుతూనే ఉంటుంది. మేము ఇటీవల మంచి ఆట ఆడుతున్నాం కానీ ఈ రోజు మా ఉత్తమ ఆట ప్రదర్శించలేకపోయాం. అదే మాకు నష్టం చేసిందని హార్దిక్ చెప్పుకొచ్చాడు.ముంబై ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టు అని ప్రతి మ్యాచ్ చాలా కఠినంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఒక్కసారి ఒత్తిడి తగ్గిస్తే ప్రత్యర్థులు దాన్ని ఉపయోగించుకుంటారన్నాడు. ఈ మ్యాచ్ ను పాఠంగా తీసుకుని నాకౌట్ దశ కోసం సిద్ధంగా ఉండాలని హార్దిక్ సూచించాడు.

ఫలితం
ఈ మ్యాచ్ కోసం అశ్వనీ కుమార్ ను తీసుకున్నామని సీజన్ అంతా అతడిపై నమ్మకం చూపించామన్నారు. ఈ పిచ్‌పై స్పిన్నర్, పేసర్ కాంబినేషన్ పని చేస్తుందనే భావించామని కానీ ఫలితం మేం అనుకున్నట్లు, రాలేదన్నాడు. అయినా మా ప్రణాళికలో భాగంగా ఇది ఉండే అంశం అని హార్దిక్ వివరించారు. పరిస్థితులు రెండో ఇన్నింగ్స్(Second innings) లో మారినట్లుగా అనిపించలేదన్నాడు. పంజాబ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారన్నాడు. తాము అంత గొప్పగా బౌలింగ్ చేయలేకపోయామని ఈ క్రమంలో కూడా నష్టం జరిగిందని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు ఎలిమినేటర్ లోకి వెళ్తున్నామని అక్కడ మంచి బ్యాటింగ్, బౌలింగ్ తో కూడా అద్భుత ప్రదర్శన అవసరమన్నాడు. ప్రణాళికలపై మళ్లీ పని చేసి సరైన టెంప్లేట్ ఏంటో అర్థం చేసుకుని దాన్ని అమలు చేస్తామన్నాడు.
Read Also: Ricky Ponting: రికీ పాంటింగ్ వల్లే ఈ విజయం: శ్రేయస్ అయ్యర్