हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025 :గుజరాత్ జట్టును వీడిన గ్లెన్ ఫిలిప్స్

Anusha
IPL 2025 :గుజరాత్ జట్టును వీడిన గ్లెన్ ఫిలిప్స్

2025 ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఓ భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు దూరమయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు గ్లెన్ ఫిలిప్స్ దూరం కావడం పెద్ద దెబ్బే. గ్లెన్ ఫిలిప్స్ జట్టు నుంచి అకస్మాత్తుగా దూరం కావడానికి వివరాలు స్పష్టంగా లేనప్పటికీ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గాయం కారణంగా దూరం అయినట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలో గ్లెన్ ఫిలిప్స్ గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

గుజరాత్ ప్రకటన

గ్లెన్ ఫిలిప్స్ గాయంపై గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. గ్లెన్ ఫిలిప్స్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ‘గ్లెన్ ఫిలిప్స్ త్వరగా కోలుకోవాలని గుజరాత్ టైటాన్స్ కోరుకుంటోంది.” అని ఆ జట్టు తన ప్రకటనలో తెలిపింది.ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోపీలో న్యూజిలాండ్ తరపున ఈ 28 ఏళ్ల ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా రాణించాడు. తన ఫిట్‌నెస్, అథ్లెటిజంతో పాకిస్థాన్, దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ న్యూజిలాండ్ ఆటగాడు కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు పట్టాడు. ఏప్రిల్ 6న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గ్లెన్ ఫిలిప్స్ గాయపడినట్లు తెలుస్తోంది.

స్పష్టంగా తెలియదు

ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడిన ఏ మ్యాచ్‌లోనూ గ్లెన్ ఫిలిప్స్ కనిపించలేదు. గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం ఫ్రాంచైజీ చూస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. శుభ్‌మన్ గిల్ జట్టు శనివారం లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ జట్టు ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.గ్లెన్ ఫిలిప్స్ గాయం కారణంగా గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ బ్యాలెన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అతడి ఫినిషింగ్ స్కిల్ల్స్, డెత్ ఓవర్లలో బౌలింగ్, ఫీల్డింగ్ఆల్ రౌండ్ ప్రతిభ ఇప్పుడు జట్టుకు మిస్సవుతుందని స్పష్టంగా భావిస్తున్నారు. టీమ్ కెప్టెన్, కోచ్‌లు ఇప్పటికే ఈ లోటును పూరించేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.గ్లెన్ తిరిగి మైదానంలోకి రావాలంటే కనీసం రెండు నుంచి మూడు వారాలు పడే అవకాశం ఉంది. అయితే టోర్నమెంట్ మిడిల్ స్టేజ్ దాటేసిన నేపథ్యంలో, అతడిని తిరిగి తీసుకోవడం సాధ్యపడకపోవచ్చు.అభిమానులు సోషల్ మీడియా వేదికగా గ్లెన్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. “గ్లెన్ లాంటి ఆటగాడి గాయం జట్టుకు పెద్ద దెబ్బే”, “ఫిట్‌గానే తిరిగి రావాలి” అంటూ స్పందిస్తున్నారు.గ్లెన్ లేకపోయినా గుజరాత్ టైటాన్స్ తన దూకుడును కొనసాగిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది.

Read Also: CSK : చెపాక్లో చెన్నై చెత్త రికార్డులు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870