हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Tennis Player: పిల్లలకు పాలు ఇవ్వడం చాలా కష్టమైన పని: సానియా మీర్జా

Anusha
Tennis Player: పిల్లలకు పాలు ఇవ్వడం చాలా కష్టమైన పని: సానియా మీర్జా

మూడు సార్లు గర్భవతి అవ్వడం కంటే పిల్లలకు పాలు ఇవ్వడం చాలా కష్టమైన పని అని భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తెలిపారు. తన కుమారుడికి పాలిచ్చే సమయంలో తీవ్ర మానసిక వేదనను అనుభవించినట్లు చెప్పారు. తల్లైన అనుభవాలు, ఆట నుంచి వీడ్కోలు కావడానికి గల కారణాలను ఓ పాడ్‌ కాస్ట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.సానియా తన మొదటి గర్భధారణ , కుమారుడు ఇజాన్ మిర్జా మాలిక్‌కు జన్మనిచ్చిన తర్వాత ఎదుర్కొన్న అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గర్భం దాల్చడం ఒక అద్భుతమైన అనుభవం అయినప్పటికీ, బిడ్డకు పాలివ్వడం మాత్రం ఆమెకు చాలా కష్టంగా అనిపించిందట. నిద్రలేని రాత్రులు, నిరంతరాయంగా బిడ్డకు ఆహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఆమెను శారీరకంగా , మానసికంగా బాగా అలసిపోయేలా చేసింది.పాలిచ్చేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. ప్రొఫెషనల్ కెరీర్‌లో ఉన్నవారు. ఉద్యోగాలు చేసే వారికి పాలు ఇవ్వడం కష్టమవుతోంది. పాలిచ్చే సమయానికి వేరే పనిలో ఉండాల్సి వస్తుంది.

అనుభవం

ఈ కష్టమైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూనే సానియా చమత్కారంగా వ్యాఖ్యానించారు. “నేను మరో మూడు సార్లు గర్భవతి అయినా అవుతానేమో కానీ, ఆ పాలిచ్చే వ్యవహారం మాత్రం మళ్లీ చేయగలనో లేదో నాకు తెలియదు” అని ఆమె నవ్వుతూ అన్నారు. ఈ మాటల్లో ఆమె మాతృత్వాన్ని ఎంతగా ఆస్వాదిస్తున్నారో, అదే సమయంలో బిడ్డ ఆలనాపాలనా ఎంత బాధ్యతతో కూడుకున్నదో తెలియజేశారు.గర్భధారణ అనేది అనేక హార్మన్లతో కూడుకున్న అంశం. ప్రెగ్నెన్సీ అనేది అందమైన అనుభవం. నా కొడుకు ఇజాన్‌కు పాలు ఇస్తున్నప్పుడు నేను అలసిపోయాను. నా కొడుక్కి మూడు నెలలు మాత్రమే పాలు ఇచ్చాను. నా బిడ్డకు పోషకాహరం అందించే ఏకైక వ్యక్తిగా ఉండటం మానసిక ఆందోళన కలిగించింది. అలాగే పసిబిడ్డతో నిద్ర లేకపోవడం, మానసిక కుంగుబాటు నన్ను వెంటాడాయి.

 Tennis Player: పిల్లలకు పాలు ఇవ్వడం చాలా కష్టమైన పని: సానియా మీర్జా

వైవాహిక జీవితం

పాలు ఇవ్వడం నా వల్ల కాలేదు. వెంటనే వైద్యుడిని సంప్రదించా. మరో నెల పాలు ఇవ్వాలని డాక్టర్ చెప్పారు. కానీ నా వల్ల కాదని చెప్పాను. ఇటు తల్లిగా అటు ప్రొఫెషనల్ ప్లేయర్‌గా కొనసాగలేకనే ఆటకు వీడ్కోలు పలికాను. నా కొడుకుతో ఎక్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ‘అని సానియా మీర్జా చెప్పుకొచ్చింది. ఇక సానియా మీర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. సానియా మీర్జా తన 15 ఏళ్ల దాపంత్య జీవితానికి గుడ్ బాయ్ చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో అతనితో సానియా మీర్జా బంధం తెగిపోయినట్టు అయింది. షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్ పెట్టుకున్నాడని,ఆ కారణంగానే సానియా మీర్జాతో అతను దూరంగా ఉంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వార్తలను నిజం చేస్తూ సనా జావేద్‌‌ను షోయబ్ పెళ్లాడాడు. సానియా మాత్రం సింగిల్‌గానే తన కొడుకుతో జీవితాన్ని సాగిస్తున్నారు.

Read Also :IPL 2025: కేకేఆర్ తో జరుగుతోన్న మ్యాచులో అదరగొడుతున్నపంజాబ్ కింగ్స్ బ్యాటర్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870