ఆర్సీబీ విజయోత్సవ వేడుక సందర్భంగా బుధవారం రోజు బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో 30 ఏళ్లు లోపు వారే 11 మంది ప్రాణాలు కోల్పోగా 75 మంది తీవ్రంగా గాయపడ్డారు.అయితే తొక్కిసలాట జరిగిన తర్వాత వివాదాల్లో చిక్కుకున్న కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(KSCA) గురించి వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కార్యదర్శి ఏ.శంకర్, కోశాధికారి ఈఎస్ జయరాం తమ పదవులకు రాజీనామా చేశారు. గురువారం రాత్రి ఇద్దరూ తమ రాజీనామాలను కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు రఘురామ్ భట్‌కు సమర్పించారు. ఈ తొక్కిలాట ఘటనలో 11 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు.
సంయుక్త ప్రకటన
అయితే ఈ సంఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇది జరిగిందంటూ అంటూ KSCA, ఇటు సర్కారుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యకం అయ్యాయి. KSCA అధికారులు సహా, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చాయి.
బాధ్యత వహించబోమని
గత రెండు రోజులుగా ఊహించని, దురదృష్టకర ఘటనలు జరిగాయి. ఇందులో మా పాత్ర పరిమితమైనప్పటికీ మేము ఈ పదవులకు రాజీనామా చేస్తున్నాం.” అని శంకర్, జయరాం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 4న జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సభలో జనసమూహం లేదా గేట్ నిర్వహణకు తాము బాధ్యత వహించబోమని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం(Karnataka State Cricket Association) గతంలో తెలిపింది. జనాలను నియంత్రించే పనిని ఆర్సీబీ, దాని ఈవెంట్ భాగస్వామి డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ నిర్వహించిందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది.

వివరాల ప్రకారం
ఆర్సీబీకి ఘన స్వాగతం లభించింది. అయితే ఈ వేడుక కాస్త విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో దాదాపు 11 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అరెస్ట్ అయిన వారిలో ఆర్సీబీ టాప్ మార్కెటింగ్ అధికారి నిఖిల్ సోసాలే(Nikhil Sosale) కూడా ఉన్నాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు బెంగళూరులోని కెంపె గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబై వెళ్తుండగా అతడిని అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఈ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉన్నతాధికారులను
గురువారం సాయంత్రం ముందుగా, సీఎం చర్య తీసుకుని, పోలీసులను ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేయాలని ఆదేశించారు. ఆర్సీబీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఉన్నతాధికారులను అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారు. చర్య తీసుకుని, బెంగళూరు పోలీస్ కమిషనర్‌తో సహా 8 మంది అధికారులను సస్పెండ్ చేశారు. సీఎం తన సొంత రాజకీయ కార్యదర్శిని కూడా తొలగించారు.
Read Also: Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ కి కాబోయే భార్య గురించి మీకు తెలుసా?