ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్కార్ మరో శుభవార్తను ప్రకటించనుంది.రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చిరుధాన్యాలు కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు.ఈ విధానం పై నాదేండ్ల మనోహర్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులతో ఆయన చర్చించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులందరికి సబ్సిడీ రేట్లలో పప్పు ధాన్యాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
చిరు ధాన్యాలు
ఈ విధానం పై నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన పోషకాహారాన్ని సరసమైన ధరలలో అందుబాటులోకి తీసుకు రావడం, ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. త్వరలోనే రేషన్ షాపుల ద్వారా చిరు ధాన్యాలు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతన్నాయని, ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చించినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలు, హాస్టల్లకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆరోగ్యానికి మేలు
చిరుధాన్యాలలో ముఖ్యంగా జొన్న, కొర్రలు, సజ్జలు వంటి పోషక విలువలు ఉన్న గింజలే రేషన్ ద్వారా అందించనున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యాలుగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని సూచనలున్నాయి. సాధారణ ప్రజలకు చిరుధాన్యాలను అందుబాటులోకి తేవాలని,నిర్ణయించింది.ప్రభుత్వం రేషన్ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది.రైతుల నుంచి నేరుగా ఈ ధాన్యాలను సేకరించి రేషన్ డిపోలకు పంపించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నారు. దీని ద్వారా రైతులకు సరైన ధర లభించే అవకాశం ఉంది. రైతులకు ఆదాయం పెరగడమే కాకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం కూడా అందుతుంది.ఈ కార్యక్రమం ప్రారంభం కావడం ద్వారా గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులకు పోషకాహారం లభిస్తుంది. రేషన్ ద్వారా కేవలం బియ్యం మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరచే చిరుధాన్యాలు అందించడం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ChandrababuNaidu: ప్రజా ఫిర్యాదులను తేలిగ్గా తీసుకోవద్దన్న సీఎం చంద్రబాబు