స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం కమ్ బ్యాక్ అవ్వాలని బాగానే ప్రయత్నిస్తున్నాడు. తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ సినిమాని గ్రాండ్‌గా తీశాడు. కానీ ఆ రెండు పార్టులు కూడా అంతగాఆడలేదు . పెట్టిన బడ్జెట్‌ను కూడా రికవరీ చేయలేదు. ఇక మణిరత్నంని నమ్మి ఎవ్వరూ అంతంత భారీ బడ్జెట్‌ను పెట్టరని, అవకాశాలు ఇవ్వకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ వెంటనే కమల్ హాసన్‌తో థగ్ లైఫ్‌ను ప్రకటించాడు మణిరత్నం. నాయగన్ తరువాత మళ్లీ ఈ కాంబో ఇలా సెట్ అయింది.థగ్ లైఫ్ మూవీ నుంచి ఇప్పటికే ఓ గ్లింప్స్ వచ్చింది. రీసెంట్‌గానే జింగుచా అనే పాటను రిలీజ్ చేశారు. ఇందులో శింబు స్టెప్పులు, కమల్ హాసన్ స్టైల్, గ్రేస్ ఫుల్ స్టెప్పులు బాగానే వైరల్ అయ్యాయి. ఈ పాటకు కమల్ హాసన్ సాహిత్యాన్ని అందించిన సంగతి తెెలిసిందే. ఇక ఏ ఆర్ రెహమాన్ ఈ ఫస్ట్ సింగిల్‌తోనే సినిమా మీద పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశాడు. థగ్ లైఫ్ ప్రమోషన్స్‌లో భాగంగా శింబు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు
స్టార్ హీరోల్లో కొంత మంది చెప్పిన టైంకి సెట్‌కి రారు. వారు వచ్చినప్పుడే షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే మరి కొంత మంది స్టార్ హీరోలు మాత్రం చెప్పిన టైంకి సెట్‌కు వస్తారు. షూటింగ్‌కి లేటుగా వస్తాడు.. చెప్పింది చేయడు.నచ్చిందే చేస్తాడు అనే కంప్లైంట్స్ చాలా మంది మీద వస్తుంటాయి. ఇక తాజాగా తన మీద వినిపించే ఈ కంప్లైంట్స్ మీద శింబు స్పందించాడు. ‘నేను షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తానని అంతా అంటుంటారు.కానీ మణిరత్నం లాంటి దర్శకుడు ఉంటే నేను ఎందుకు లేటుగా వస్తాను. ఆ రోజు ఏ సీన్ తీయాలి ఏ సీన్ ఎలా తీయాలి ఎంత టైంలో తీయాలి ఇలా అన్ని విషయాల్లో క్లారిటీ ఉంటుంది. సెట్‌లో ఆయన మన టైం వేస్ట్ చేయరు అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి టైమ్, క్లారిటీ, పేమెంట్స్ అన్నీ ఇలా సరిగ్గా ఉంటాయి కానీ కొంత మంది మాత్రం సెట్‌లోకి వచ్చాక అలా చేద్దాం,ఇలా చేద్దామని చెబుతుంటారు.అలా వారికే ఓ క్లారిటీ ఉండదు,సెట్‌కు వచ్చాక మన టైం వేస్ట్ అవుతుంది.కాల్షీట్స్ వేస్ట్ అవుతాయి సినిమా అనుకున్న టైంకి రాదు నిర్మాతకు నష్టాలు ఇలా చాలా ఉంటాయి.అందుకే నేను టైంకి వెళ్లను నాకు నా జర్నీలో మణిరత్నం లాంటి దర్శకులు ఇంకా దొరికితే మరిన్ని చిత్రాలు చేసి ఉండేవాడ్నేమో’ అని శింబు అన్నాడు. ఇక శింబు పాడిన ఓజీ పాటను త్వరలోనే వినే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ఓజీ కోసం శింబు ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ ఫస్ట్ సింగిల్ పాటను శింబు ఎప్పుడో పాడేశాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read Also: Simbu: కోహ్లీపై హీరో శింబు కామెంట్స్