हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Shefali Jariwala: గుండెపోటుతో నటి షఫాలీ జరివాలా మృతి

Anusha
Shefali Jariwala: గుండెపోటుతో నటి షఫాలీ జరివాలా మృతి

ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా (42) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆమె చనిపోయారు. ముంబైలోని బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లే సరికి ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. షెఫాలీ మరణం సినీ పరిశ్రమను, ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 2000 సంవత్సరం మొదట్లో ‘కాంటా లగా’ అనే పాటతో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అలా ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. ఆమెకు కాంటా లగా గర్ల్ అనే పేరు వచ్చేసింది. షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) ను ఆమె భర్త పరాగ్ త్యాగి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే షెఫాలీ చనిపోయిందని వైద్యులు తెలిపారు. షెఫాలీని ఆసుపత్రికి తీసుకువచ్చే ముందే ఆమె చనిపోయారు. ఆమె భర్త, మరికొందరు ఆమెతో ఉన్నారు అని హాస్పిటల్ టీం చెప్పింది. షెఫాలీ జరీవాలా మరణం చాలా మందికి షాక్‌ను కలిగించింది. ఇలా అకస్మాత్తుగా గుండె పోటు ఏంటి? మరణించడం ఏంటి? అని అంతా ఆశ్చర్యపోతోన్నారు.

అభిమానులు ముద్దుగా కాంటా లగా గర్ల్ అని కూడా పిలుస్తుంటారు

షెఫాలీ జరివాలా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె అహ్మదాబాద్‌లో జన్మించింది. 2002 సంవత్సరంలో ఆశా పరేఖ్ చిత్రంలోని కాంటా లగా పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ పాటను ముజ్సే షాదీ కరోగి చిత్రం (Mujhse Shaadi Karogi movie) లో ఉపయోగించారు. ఇప్పటికీ ఈ పాటకు యూట్యూబ్ లో అత్యధిక మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట హిట్ కావడంతో షెఫాలిని అభిమానులు ముద్దుగా కాంటా లగా గర్ల్ అని కూడా పిలుస్తుంటారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 13లోనూ షెఫాలి పాల్గొంది. అలాగే ముజ్సే షాదీ కరోగి సినిమా తర్వాత హిందీలో ఆమె మరో సినిమా చేయలేదు.

వార్తల్ని నమ్మలేకపోతోన్నాము

ఆమె మరణ వార్తతో అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తల్ని నమ్మలేకపోతోన్నాము అంటూ నెటిజన్లు, ఆమె ఫాలోవర్లు కామెంట్లు (Comments) పెడుతున్నారు. ఇన్ స్టాలో ఆమెకు 33 లక్షల మందికిపైగా ఫాలోవర్లున్నారు. చాలా మంది అభిమానులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులు ఇంకా రాలేదని తెలుస్తోంది. ఇది సాధారణ మరణమా? ఇంకేమైనా రహస్యాలు దాగి ఉన్నాయా? అన్నది పోలీసుల విచారణ తరువాతే తెలియనుంది.

Read Also: Kalki 2: ఎట్టకేలకు ‘ కల్కి 2 ‘ విడుదల నెల చెప్పిన నిర్మాత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870