YSRCP: విశాఖపట్నంలో వైఎస్‌ఆర్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, నగరానికి చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకటరావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. వెంకటరావు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం రాత్రి తన రాజీనామాపై ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తన రాజీనామా లేఖను అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి పంపినట్లు తెలిపారు.

2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు
చొక్కాకుల వెంకటరావు వైఎస్‌ఆర్‌సీపీ స్థాపించిన వెంటనే పార్టీలో చేరారు. 2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. వైఎస్‌ఆర్‌సీపీకి అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు చేతిలో ఓడిపోయారు. 2019లో వైఎస్‌ఆర్‌సీపీకి అధికారంలోకి వచ్చాక వెంకటరావు భార్య లక్ష్మికి పదవి దక్కింది. ఆమె వీకేపీసీపీసీఐఆర్‌యూడీఏ (విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
ఆయన ఏదైనా పార్టీలో చేరతారా? లేదా? అన్నది చూడాలి
ఆ తర్వాత చొక్కాకుల అదే సంస్థకు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన కొంతకాలంగా వెంకటరావు వైఎస్‌ఆర్‌సీపీకి కార్యక్రమాల్లో యాక్టివ్‌గా లేరు. ఈ మేరకు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఏదైనా పార్టీలో చేరతారా? లేదా? అన్నది చూడాలి. ఆయన కూటమి పార్టీలవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ప్రకటించాల్సి ఉంది. గతంలో ఆయన బీజేపీలో కూడా పనిచేయడంతో ఆయన ఆ పార్టీవైపు వెళతారా అనే టాక్ కూడా వినిపిస్తోంది.