The Raja Saab Twitter Review : పాన్ ఇండియా స్టార్ Prabhas గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ సినిమా విడుదల అవుతుందంటే ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రీమియర్స్ నుంచే థియేటర్లలో సందడి నెలకొంది. ఈసారి ప్రభాస్ హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో నటించిన The Raja Saab సినిమా సంక్రాంతి కానుకగా నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.
ది రాజాసాబ్ టైటిల్ కార్డ్‌తోనే అంచనాలు ఒక్కసారిగా పెరిగాయని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా ప్రారంభం నుంచి బాగుందంటూ కొందరు ట్విట్టర్‌లో పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయిందని, ఆయన డ్యాన్స్ కూడా ఆకట్టుకుందని ప్రశంసిస్తున్నారు.
Nara Lokesh : చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు
అయితే మరోవైపు నెగటివ్ కామెంట్స్ కూడా (The Raja Saab Twitter Review) వినిపిస్తున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ బోర్‌గా ఉందని, ఒక్క సీన్ కూడా ఇంప్రెస్ చేయలేదని కొంతమంది నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. సినిమాకు వెళ్లడం డబ్బుల వృథా అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ సరిగా వర్క్ అవ్వలేదని, విజువల్స్ ఆశించిన స్థాయిలో లేవని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్‌లో చూపించిన కొన్ని కీలక సన్నివేశాలు మూవీలో కనిపించలేదని కూడా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫైట్స్, తాత గెటప్‌లో రాజాసాబ్ సీన్లు లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఇవన్నీ సెకండ్ పార్ట్‌లో ఉంటాయేమోనని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, కీలక సన్నివేశాలు మిస్ కావడంతో మరికొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: