हिन्दी | Epaper

Pune: నదిలో కుప్పకూలిన వంతెన..మరో ఆరుగురి పరిస్థితి విషమం

Anusha
Pune: నదిలో కుప్పకూలిన వంతెన..మరో ఆరుగురి పరిస్థితి విషమం

మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. పుణెలోని ఇంద్రయాని నదిపై ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది.వంతెన కుప్పకూలిన సంగతి తెలిసిందే,ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 51 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పుణె ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన పాత కట్టడం. ఇది శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడి కుండ్మాల గ్రామం (Kundmala village) సమీపంలోని నదిపైన ఉన్న కట్టడం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వంతెన కూలిపోయింది.ఈ సంఘటన పూణే నుండి 30 కి.మీ దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన తలేగావ్‌లోని కుండ్ మాలా సమీపంలో జరిగింది.

వరద ప్రవాహం

ఇది సహజ సింక్‌హోల్స్, లోయలు, ప్రత్యేకమైన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఉప్పొంగుతున్న నదిని చూడటానికి పాత వంతెన పైకి ఒక్కసారిగా 125 మంది గుమి గూడారు. అయితే వరద ప్రవాహం ధాటికి వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. వంతెన శిధిలావస్థకు చేరుకోవడంతో గతంలోనే వంతెనపై రాకపోకలు నిలిపివేయడం జరిగింది. అయితే వరద ప్రవాహాన్ని చూడడానికి బ్రిడ్జిపై ప్రజలు గుమిగూడటంతో ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, గ్రామస్తులు, విపత్తు సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కింద శిధిలాల కింద పడి మృతి చెందిన వారి డెడ్‌బాడీలను వెలికి తీశారు.

Pune

పరిస్థితి విషమం

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వంతెన కూలిన ఘటనపై దేవేంద్ర ఫడ్నవీస్ తో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రధాని, కేంద్ర హోం మంత్రి సంతాపం తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముగిసినట్లు జాతీయ విపత్తు సహాయ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) సోమవారం తెలిపింది. నలుగురు మృతి చెందినట్లు నిర్ధారించగా, ఇద్దరి మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Indus Water: పాక్ కు సింధు నీళ్లు అందకుండా భారత్ మరో వ్యూహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

📢 For Advertisement Booking: 98481 12870