ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణకు సంబంధించిన వివాదంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రతికూల ఫలితం ఎదురైంది. తమపై అటవీశాఖ అధికారులు నమోదు చేసిన క్రిమినల్ కేసు(criminal case)ల విచారణను నిలిపివేయాలని కోరుతూ వారు దాఖలు చేసుకున్న అనుబంధ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రిమినల్ కేసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ జస్టిస్ చల్లా గుణరంజన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.చిత్తూరు జిల్లా మంగళంపేట ప్రాంతంలోని పలు సర్వే నంబర్లలో తమ ఆధీనంలో ఉన్న సుమారు 75.74 ఎకరాల భూమిని ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి తమ్ముడి భార్య పి. ఇందిరమ్మ కలిసి గతంలో హైకోర్టును ఆశ్రయించారు.

కఠినమైన
ఈ నేపథ్యంలో, తమపై అటవీశాఖ చేపట్టిన క్రిమినల్ చర్యలను ఆపాలని కోరుతూ తాజాగా వారు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి, క్రిమినల్ ప్రొసీడింగ్స్(Criminal proceedings)పై స్టే విధించడానికి అంగీకరించలేదు. అయితే, పిటిషనర్ల అధీనంలో ఉన్న భూముల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తే, చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని రెవెన్యూ, అటవీశాఖ అధికారులను గతంలో ఇదే హైకోర్టు ఆదేశించిన విషయాన్ని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో గుర్తుచేశారు.
Read Also: Vallabhaneni Vamsi: కోర్టు అనుమతితో వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు