గాజా(Gaza) మొత్తాన్ని ఆక్రమిస్తామంటూ ఇజ్రాయెల్(Israel) చేసిన వ్యాఖ్యలపై యూకే, ప్రాన్స్, కెనడా(UK,France, Canada) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఈ దేశాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. మరోవైపు దీనిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తీవ్రంగా ఖండించారు. 2023 అక్టోబరు 7న జరిగిన ఘటనను పట్టించుకోకుండా, ఇప్పుడు దాడులు చేసేలా ప్రోత్సాహిస్తున్నారని ఆరోపించారు.

మా రక్షణ కోసం దాడులు చేస్తున్నాము:నెతన్యాహు
ఇజ్రాయెల్ హమాస్‌పై పూర్తి విజయం సాధిచండమే లక్ష్యంగా ఉన్నట్లు మరోసారి నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ న్యాయబద్ధమైన మార్గాల్లో తనను తాను రక్షించుకుంటూ పూర్తి విజయాన్ని సాధించే వరకు పోరాడుతూనే ఉంటుందని చెప్పారు.
‘హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించకముందే రక్షణ యుద్ధాన్ని ఆపాలని చెబుతున్నారు. అంతేకాకుండా పాలస్తీనా ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులపై వారు స్పందించలేదు. ఇప్పుడు మా రక్షణ కోసం దాడులు చేస్తుంటంటే స్పందిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో మరిన్ని దాడులకు ఆహ్వానం పలకడమే అవుతుంది. యుద్ధం ముగించే విషయంలో ట్రంప్ ప్రతిపాదించిన విధానాన్ని ఇజ్రాయెల్ అంగీకరిస్తోంది. యూరోపియన్ నాయకులు కూడా అదే దిశగా ముందుకు సాగాలని పిలుపునిస్తున్నారు’ అని నెతన్యాహు పేర్కొన్నారు.
భూతల దాడులు ఖండించిన యూకే, ప్రాన్స్, కెనడా
‘గిడియన్ చారియట్స్’ పేరుతో గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు చేయడాన్ని ఖండిస్తూ యూకే, ప్రాన్స్, కెనడా సంయుక్తంగా ఓ ప్రకటను విడుదల చేశాయి. ఈ దాడి వల్ల గాజాలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పాయి. మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ ఆంక్షలు విధించడాన్ని ఎత్తివేయాలని సూచించాయి. ఇజ్రాయెల్ ఇదే విధంగా కొనసాగితే కచ్చితంగా ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశాయి. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి.
వెనక్కి తగ్గేదేలేదు :నెతన్యాహు
గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని గిడియన్ చారియట్స్ పేరుతో చేసిన దాడుల సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. తమ పోరాటం తీవ్రస్థాయిలో ఉందని పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని ఇందులో వెనక్కి తగ్గేదేలేదని తేల్చిచెప్పారు. మరోవైపు గాజాలోకి పరిమిత మానవతా సాయం ప్రవేశించేందుకు నెతన్యాహు అనుమతించారు. ఫలితంగా దాదాపు మూడు నెలల తర్వాత మానవతా సాయం గాజాలోకి ప్రవేశించింది. పసిపిల్లలతో పాటు ఇతరులకు కావాల్సిన ఆహారంతో కూడిన ఐదు ట్రక్కులు కేరం షాలోమ్ సరిహద్దు గుండా గాజాలోకి ప్రవేశించాయి.
భవిష్యత్ సంక్షోభం
- ఇజ్రాయెల్ యొక్క తదుపరి దాడులతో మరింత ప్రక్షోభం కలిగే అవకాశం ఉందని అంచనా.
- అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయెల్ పై ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది, దీనితో గొప్ప మార్పులు జరిగే అవకాశం.
Read Also: India, Pakistan War: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు సాయం చేశారా..? చైనా సమాధానం ఇదే !